పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ ఉనికిని కోల్పోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే కనీసం మూడేళ్లు కూడా నిలబడలేదని అన్నారు. రాష్ట్రంలో 1.93 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేయకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమానిందని అన్నారు. టీఎస్పీఎస్పీని బీఆర్ఎస్ అమ్మకం లో పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పులు కుప్పగా మార్చేస్తుందని జీవన్ రెడ్డి చెప్పారు.
Advertisement
Advertisement
బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ని కూడా ఇవ్వలేదని అన్నారు. పేరు మార్చేటప్పుడు పార్టీ కనుమరుగైపోయిందని చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో ఒక్క పర్యటనతో తెలంగాణకి 40,000 కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు జీవన్ రెడ్డి. ఇలా జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!