కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఆరు హామీలు అమల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈ బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటు లోకి వచ్చాక ఆర్టీసీ బస్సులలో రద్దీ బాగా పెరిగింది. గతం లో 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షల కి చేరుకుంది. ఉచిత బస్సు యాత్ర పై కామా రెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటి పల్లి వెంకట రమణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement
నెల కి రూ. 10000 ఆదాయం ఉన్నా కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే తను దృష్టి లో వాళ్ళు బిచ్చ గాళ్ళు అని అన్నారు. భగవంతుడు చిన్నచూపు చూసి.. గుడికాడ ఉండి అమ్మ అయ్యా అని అడుక్కుంటారు చూశారా వాళ్ళ లాగే మీరు కూడా అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అలానే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా రైతు బంధు తీసుకున్న బిచ్చమెత్తుకున్నట్టే అని కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే కాటి పల్లి వెంకట రమణ రెడ్డి కామెంట్స్ చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!