Home » రిటైర్మెంట్ కు కారణం చెప్పిన మిథాలీ..!

రిటైర్మెంట్ కు కారణం చెప్పిన మిథాలీ..!

by Azhar
Ad

భారత మహిళల జట్టుకు ఎన్నో సేవలు అందించిన మిథాలీ రాజ్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ళ వయస్సులో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన మిథాలీ ఆరు ప్రపంచ కప్పులు ఆడింది. కానీ ఆ టైటిల్ ను మాత్రం అందుకోలేకపోయింది. దాంతో తాజాగా తన 23 ఏళ్ళ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికింది. అయితే తాజాగా మిథాలీ రాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాను అనే విషయం పై క్లారిటీ ఇచ్చింది.

Advertisement

మిథాలీ మాట్లాడుతూ… నేను ఈ నిర్ణయాన్ని ఆలోచించంచకుండా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ రిటైర్మెంట్ పై నేను చాల ఆలోచించాను. అయితే నా కెరియర్ లో మరో ప్రపంచ కప్ ఆడే అవకాశం లేదు. చివరిసారిగ మేము ఓడిన ప్రపంచ కప్ నాకు చాలా బాధను కలిగించింది. దాని నుండి కోలుకోవడానికి ఇంత సమయం పట్టింది. నాలో ఇంకా కొంత క్రికెట్ ఆడే సామర్ధ్యం అనేది తప్పకుండ ఉంది. కానీ నేను ఇంకో ప్రపంచ కప్ ఆడలేదు.

Advertisement

అందువల్లే నేను క్రికెట్ లో ఇంకా ఉండి ఏం ఉపయోగం అనిపించింది. అందుకే రిటైర్మెంట్ ఇచ్చాను. అయితే నా ఈ సుదీర్ఘ కెరియర్ లో ఒక్క ప్రపంచ కప్ సాధించలేదు అనే భాధ తప్ప.. నేను సంతృప్తిగానే ఉన్నాను. మహిళల క్రికెట్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి నేను నా కళ్లారా చూసాను. ఇక మన మహిళల క్రికెట్ ను ఇంకో 5 ఏళ్లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ టీంగా చూడవచ్చు. ఇప్పుడు ఉన్న జట్టులో చాలా మంది యువ ప్లేయర్లు ఉన్నారు. అలాగే ఇప్పుడు జట్టులో బ్యాటింగ్ బాగా ఉంది. కానీ బౌన్గ్ పైన కొంచెం దృష్టి పెట్టాలి. అలా చేస్తే మహిళల జట్టు కూడా పురుషుల జట్టు మాదిరే అవుతుంది అని మిథాలీ చెప్పింది.

ఇవి కూడా చదవండి :

రోహిత్, రాహుల్ పై ఓపెనర్ ఇషాన్ షాకింగ్ కామెంట్స్.. వారిని జట్టులో నుండి…

సోనీకి కాదు మళ్ళీ స్టార్ స్పోర్ట్స్ కే మీడియా హక్కులు…!

Visitors Are Also Reading