Home » మీ వివాహ బంధంలో అస్సలు చేయకూడని తప్పులు..!!

మీ వివాహ బంధంలో అస్సలు చేయకూడని తప్పులు..!!

by Sravanthi
Ad

సాధారణంగా ప్రేమ బంధం లో అయినా పెళ్లి బంధం లో అయినా గొడవలు,అలకలు, నవ్వులు, ఏడుపులు అనేవి వస్తూనే ఉంటాయి. ఎంతటి ఎత్తు పల్లాలు ఎదురైనా ఆలోచనతో బంధాన్ని ముందుకు తీసుకెళ్తేనే హాయిగా జీవిస్తారు. కానీ ఈ బంధం లో ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గకపోయినా సాఫీగా సాగే మీ బంధం అనేక సమస్యల్లో పడవచ్చు. అంతేకాకుండా మీ వివాహ బంధంలో మీరు చేసే ఇలాంటి కొన్ని తప్పుల వల్లే మీ భాగస్వామి యొక్క మనసు పాడవుతుంది. మరి మీ వివాహ బంధంలో అసలు చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హేళన చేయడం:

also read;FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా..ఫ్రైజ్‌ మనీ ఎంతో తెలుసా ?

Advertisement

మీ దాంపత్య జీవితంలో సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న కలతలు అనేవి వస్తూ ఉంటాయి. భార్యను భర్త భర్తను భార్య చిలిపిగా హేళన చేస్తే సమస్య ఉండదు. కానీ చేయాలని పదిమందిలో ఉన్నప్పుడు ఆమెపై హేళనగా మాట్లాడుతూ మీ పరిధి దాటారు అంటే సమస్యలు మొదలైనట్టే.. ఇది మీ వివాహ బంధం తెగిపోయే వరకు రావచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా అతిహేళన అనేది భార్యాభర్తల మధ్య ఉండకూడదని నిపుణులు అంటున్నారు.
పట్టించుకోకపోవడం :

Advertisement

ప్రేమ బంధం లో అయిన వివాహ బంధంలో అయినా బహుమతులు, సర్ప్రైజ్ లు ఇస్తే చాలా సంతోషిస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు జీవిత భాగస్వామికి అస్సలు సమయం ఇవ్వకపోవడంతో ఆమె వేదనకు గురవుతుంది. కాబట్టి జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మధురమైన సమయాన్ని అలాగే బయటకు తీసుకెళ్లి బహుమతులు ఇవ్వాలని నిపుణులు అంటున్నారు.
గొడవలు:


సంసార జీవితం అన్నాక మూడు గొడవలు నాలుగు అలకలు రెండు ఏడుపులు సర్వసాధారణమే కానీ, ఇది మీ వివాహ బంధంలో ప్రతిరోజు ఉన్నట్లయితే మాత్రం ఇబ్బందులు తప్పవు. భర్త లేదా భార్య బయటకు వెళ్లి ఇంట్లోకి రాగానే గొడవ మొదలైతే మాత్రం ప్రశాంతత లేక అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల మీ వివాహ బంధం కలకాలం నిలవదు. కాబట్టి తరచూ గొడవలకు పోకుండా ప్రతిదీ అర్థం చేసుకొని ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలని నిపుణులు అంటున్నారు.

also read;

Visitors Are Also Reading