Home » “నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ను గమనించారా….!

“నువ్వు నాకు నచ్చావ్” సినిమాలో ఈ బ్లండర్ మిస్టేక్ ను గమనించారా….!

by AJAY
Ad

Nuvv Naaku Naachavu Movie: విక్టరీ వెంకటేష్ కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాలలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ నటించగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా ఈ చిత్రంలో వెంకటేష్ చేసే కామెడీ ఓ రేంజ్ లో కడుపుబ్బ నవ్విస్తుంది. మరోవైపు బ్రహ్మానందం ఎంట్రీ కూడా ఈ సినిమాలో హైలెట్ అని చెప్పాలి.

Nuvv Naaku Naachavu Movie

Nuvv Naaku Naachavu Movie

 

సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్ సీన్లు కూడా చాలా బాగుంటాయి. సినిమాలో వెంకటేష్ జులాయిగా తిరిగే ఓ యువకుడి పాత్రలో నటించాడు. అయితే వెంకటేశ్ తండ్రి చంద్ర మోహన్ కొడుకును దారిలో పెట్టాలి అని తన స్నేహితుడు ప్రకాష్ రాజ్ ఇంటికి పంపిస్తాడు. అక్కడే వెంకటేష్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడతాడు. కానీ తమ తండ్రుల మధ్య స్నేహం చెడిపోకూడదని వెంకటేష్ తన ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధం అవుతాడు.

Advertisement

Advertisement

ఈ క్రమంలో వచ్చిన ఎమోషన్స్ ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా ప్రేక్షకులు వదిలిపెట్టకుండా చూస్తారు. కానీ ఈ సినిమాలో ని మిస్టేక్ ను మాత్రం చాలామంది గమనించి ఉండరు. ఈ చిత్రంలో వెంకటేష్ ప్రకాష్ రాజ్ ఇంటికి వచ్చినప్పుడు ఆర్తి అగర్వాల్ సిస్టర్ గా నటించిన పింకీ వచ్చి తనను పరిచయం చేసుకుంటుంది. తన పేరు పింకీ అని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నా అంటూ చెబుతుంది.

అయితే మరో సీన్ లో పింకీ స్కూల్ కు వెళుతూ కనిపిస్తుంది. పింకీ బస్సు ఎక్కుతున్న సమయంలో మాత్రం లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ అని కాకుండా బివిబిపి అని బస్సు పై ఇంగ్లీష్ అక్షరాలలో రాసి ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ఈ సినిమాలో చిన్న చిన్న పొరపాట్లు చాలా ఉన్నాయి. అయితే అప్పట్లో ఈ పొరపాట్లను పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రభావం తో ఇలాంటివి వెతికి పట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు.

Also read :

దర్శకుడు వెంట పడినా బ్లాక్ బస్టర్ సినిమా “బాషా” కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా ….!

Sarkaru Vaari Paata: అద‌ర‌గొడుతున్న మ‌మ మ‌హేషా ఫుల్ సాంగ్‌..!

Visitors Are Also Reading