Home » Sarkaru Vaari Paata: అద‌ర‌గొడుతున్న మ‌మ మ‌హేషా ఫుల్ సాంగ్‌..!

Sarkaru Vaari Paata: అద‌ర‌గొడుతున్న మ‌మ మ‌హేషా ఫుల్ సాంగ్‌..!

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం స‌ర్కారు వారి పాట. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 12న విడుద‌ల‌వ్వ‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌, క‌ళావ‌తి సాంగ్ యూ ట్యూబ్ ఊపేశాయి. ఈ త‌రుణంలోనే సోష‌ల్ మీడియాను షేక్ చేసేందుకు మ‌రొక పాట సిద్ధ‌మైంది.

Advertisement

స‌ర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. పోలీస్ గ్రౌండ్ మొత్తం సూప‌ర్‌స్టార్ అభిమానుల‌తో జ‌న‌సందోహంగా మారింది. తాజాగా మ‌హేష్ ఈ వేడుక‌కు గ్రాండ్ ఎంట్రీనే ఇచ్చారు. మ‌హేష్ బాబుతో పాటు ద‌ర్శ‌కుడు సుకుమార్‌, ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా విచ్చేసారు. మ‌హేష్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. ఈ సంద‌ర్భంగా మ‌మ మ‌హేషా సాంగ్‌ను విడుద‌ల చేశారు.

Advertisement

ఈ సాంగ్‌లో మ‌హేష్‌, కీర్తి సురేష్‌లు బ్యూటిపుల్ డ్రెస్సింగ్, అదిరిపోయే స్టెప్‌ల‌తో అద‌ర‌గొట్టేసారు. స‌న్న‌జాజి మూర తెస్తా సోమ‌వారం, మ‌ల్లెపూల మూర తెస్తా మంగ‌ళ‌వారం అంటూ కొన‌సాగే.. మ‌హేష్ స్టెప్పులేయ‌గా.. మ‌మ మ‌హేషా.. నే ము.. ము.. ముస్తాబై ఇట్టా వ‌చ్చేశా అంటూ కీర్తి గ్రేస్‌తో చిందేసింది.

 

Also Read : 

Anchor Suma : యాంక‌ర్ సుమ‌కు త‌ప్పిన ప్ర‌మాదం..ఎలాగంటే..?

Sai Pallavi : పెళ్లి వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి..!

 

Visitors Are Also Reading