Home » దర్శకుడు వెంట పడినా బ్లాక్ బస్టర్ సినిమా “బాషా” కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా ….!

దర్శకుడు వెంట పడినా బ్లాక్ బస్టర్ సినిమా “బాషా” కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా ….!

by AJAY
Ad

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సౌత్ ఇండియా లోనే స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రజనీకాంత్. ఆర్టీసీ కండక్టర్ స్థాయి నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్ తన మేనరిజం, నటనతో స్టార్ హీరోగా మారిపోయారు. వరుస హిట్లు అందుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. రజినీకాంత్ తన మ్యానరిజంతో కాళ్లు చేతులు తిప్పే స్టైల్ అంటే ఫాన్స్ కు ఎంతో ఇష్టం.

Advertisement

 

అంతేకాకుండా రజిని కాంత్ మెట్లు దిగే స్టైల్, సిగరెట్ వెలిగించే స్టైల్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక రజనీకాంత్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ చిత్రాల్లో భాష సినిమా కూడా ఒకటి. ఈ సినిమానే రజనీకాంత్ కు సౌత్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో లో ముంబై ని గడగడలాడించిన డాన్ ఆటో డ్రైవర్ గా ఎలా మారతాడు.

Advertisement

ఎందుకు ఆటోడ్రైవర్ గా మారాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాను మొదట తమిళ్ లో తీశారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. తమిళ్ లో భారీ విజయం సాధించిన ఈ సినిమాను నిర్మాతలు తెలుగులో కూడా డబ్ చేయాలని అనుకున్నారు. కానీ సురేష్ కృష్ణ తెలుగులో సినిమాను రీమేక్ చేయాలనుకున్నాను. అంతే కాకుండా ఈ చిత్రాన్ని బాలకృష్ణ లేదా చిరంజీవి లతో రీమేక్ చేయాలని అనుకున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు స్టార్స్ కోసం బాషా నిర్మాతలు దేవీ శ్రీ థియేటర్ లో స్పెషల్ షో వేశారట. కానీ మన హీరోలకు ఈ సినిమా అంతగా నచ్చలేదట. ఇక బాలకృష్ణ రీమేక్ లకు దూరంగా ఉండేవారు. ఈనేపథ్యంలో బాషా సినిమాలో అవకాశం వచ్చినా లైట్ తీసుకొన్నారు. ఒకవేళ బాలయ్య ఒప్పుకుని ఉంటే బాషా సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉండేది. మరి బాలయ్య బాషా చేసి ఉంటే ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: 

Sarkaru Vaari Paata: అద‌ర‌గొడుతున్న మ‌మ మ‌హేషా ఫుల్ సాంగ్‌..! 

వీరి చేతిలో డబ్బు అస్సలు నిలబడదు.. వారు ఎవరో తెలుసా..!!

Visitors Are Also Reading