సాధారణంగా ఎవ్వరికైనా పానీ పూరి చూస్తే చాలు నోరూరుతుంది. దేశవ్యాప్తంగా సాయంత్రం అయిందంటే చాలు పానీ పూరి తినేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కొంత మంది చాట్ వద్ద తింటే.. మరికొంత మంది ఇండ్ల వద్ద తయారు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే ఇక పానీ పూరికి డిమాండ్ బాగానే ఉంటుంది. గల్లీకొక పానీ పూరి షాపు పక్కా ఉంటుంది. అంటే ఏ రేంజ్‌లో పానీపూరి తింటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే నేపాల్ రాజధాని ఖాట్మండ్ వ్యాలీలో పానీ పూరి అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేదించింది.
Advertisement
పానీ పూరిలో వినియోగించ నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఈ తరుణంలోనే పానీ పూరి అమ్మకాలను నిషేదించినట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఖాట్మాండ్ లోని లలిత్ పూర్, మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదు అయినట్టు వెల్లడించారు. ప్రస్తుతం నేపాల్‌లో కలరా రోగుల సంఖ్య 12 కు చేరుకున్నట్టు వివరించారు.
Advertisement
దీంతో కలరా వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాన నగరాల్లో, రద్దీ ఎక్కువ ప్రాంతాలు,కారిడార్ వంటి ప్రాంతాల్లో పానీ పూరి విక్రయాలను నిషేదించారు. అంతేకాకుండా ఎవరికిఐనా కరోనా లక్షణాలు కనిపించినట్టయితే సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ప్రధానంగా వేసవి, వర్షాకాలల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పింది.
Also Read :
లవంగం తీసుకుంటే షుగర్ శాశ్వతంగా దూరమవుతుందట.. ఎలాగో తెలుసా..?
అసలు అల్లు అర్జున్‌కు ఏమైంది.. ఇలా మారాడంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు..!