Telugu News » Blog » అస‌లు అల్లు అర్జున్‌కు ఏమైంది.. ఇలా మారాడంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజ‌న్లు..!

అస‌లు అల్లు అర్జున్‌కు ఏమైంది.. ఇలా మారాడంటూ ట్రోలింగ్ చేస్తున్న నెటిజ‌న్లు..!

by Anji
Ads

అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమాతోనే అల్లుఅర్జున్‌కు ఐకాన్ స్టార్ అనే బిరుదు కూడా వ‌చ్చింది. ఇప్ప‌టికీ కూడా ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా పాట‌లు, డైలాగ్స్ త‌ర‌చూ వినిపిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం పుష్ప‌-2 సినిమా కోసం బ‌న్ని సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప‌నుల్లో బిజీగా ఉన్న బ‌న్ని లుక్ ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది . అల్లుఅర్జున్ ను చూసిన నెటిజ‌న్లు అంద‌రూ ట్రోల్స్ చేస్తున్నారు.

పుష్ప సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌న్నీకి ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వ‌చ్చింది. ఈ సినిమా డైలాగ్స్ ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. పుష్ప డైలాగ్స్‌ను కేవ‌లం మ‌న‌దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా ఫాలో అయ్యారు. పుష్ప పాట‌లు కూడా విదేశాల‌లో ఇప్ప‌టికీ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాప్ సింగ‌ర్స్ ఇంగ్లీషు వెర్ష‌న్ కూడా పాడారంటే ఎంత‌లా జ‌నాల్లోకి వెళ్లిందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఈ చిత్రంలో ఆక‌ట్టుకున్న బ‌న్నీ తాజా లుక్‌పై నార్త్ నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో పుష్ప‌-2 సినిమా షూటింగ్ జ‌రుపుకుంది. ఇందులో బ‌న్ని లుక్ లీకు అయింది. బాలీవుడ్ ఫోటో గ్రాఫ‌ర్ మాన‌వ్ మంగ్లాని పుష్ప‌-2కు సంబంధించిన అల్లుఅర్జున్ లుక్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇందులో బ‌న్ని కాస్త బొద్దుగా గుండ్రాలు తిరిగిన హెయిర్ స్టైల్‌తో క‌నిపించాడు.


ఇక లావుగా త‌యారైన బ‌న్ని లుక్ పై నార్త్ ఇండియా నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వ‌డాపావ్‌, క్రికెట‌ర్ మలింగా అని, ఓ మై గాడ్ స్టైలిష్ స్టార్‌కు ఏమైంది, నిజంగానే అల్లుఅర్జున్ బ‌రువెక్కాడంటూ.. ఇలా ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు నెటిజ‌న్ల‌మే బ‌న్ని వ‌స్తున్న ట్రోల్స్ ఖండిస్తూ.. పుష్ప ది రూల్ కోసం ఇలా త‌యారు కావాల్సి వ‌చ్చింద‌ని.. అందుకే బ‌రువెక్కాడ‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు. మొత్తానికి పుష్ప -2 సినిమాలో అల్లుఅర్జున్ లావుగా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : 

విక్రమ్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…రోలెక్స్ విలన్ కాదట హీరో…?

న‌రేష్‌ ప‌విత్రా లోకేష్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా… వీరి ప్రేమ‌కు బీజం ఎక్క‌డ ప‌డింది..!


You may also like