Home » నిత్యవసర ధరలు పెరుగుదలకు కారణం కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

నిత్యవసర ధరలు పెరుగుదలకు కారణం కాంగ్రెస్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Sravya
Ad

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రుణమాఫీ ఏమైందంటూ ప్రశ్నించారు. రైతుబంధు నిధులు ఎక్కడికి పోయాయి అని కూడా ప్రశ్నించారు. దేశంలోని రైతుల్ని హోల్సేల్ గా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు రైతు బంధు నిధుల్ని రైతుల ఖాతా లో జమ చేయడానికి ఎన్ని రోజులు సాగదీస్తారు అంటూ నిలదీశారు రాష్ట్రంలో ఉన్న రైతులకి వరి ధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఎంతమందికి అందిందని అడిగారు.

Advertisement

డిసెంబర్ 9న రైతులందరికీ ఖాతాలో ఎకరా కి 15000 రైతుబంధు ఇస్తామని అన్నారు రుణమాఫీ అయిన వాళ్ళు మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకుంటే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని అన్నారు. ఇచ్చిన హామీ ఏమైంది అంటూ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 29 రోజులు పూర్తయింది. రైతుబంధు సహాయం అకౌంట్లో వేయడం మొదలు పెట్టి 27 రోజులు అయింది. ఇప్పటికీ రైతులకి పూర్తిగా డబ్బులు ఖాతా లో పడలేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 11 పర్యాయాలు రైతు బంధు పథకం కింద 72 వేల కోట్లు పెట్టుబడి సహాయంగా రైతులు ఖాతాల్లో జమ చేసామని అన్నారు.

Advertisement

అలానే ప్రతి విషయం లో పారదర్శకంగా వ్యవహరించామని చెప్పారు కానీ కాంగ్రెస్ ఎందుకు అలా వ్యవహరించట్లేదు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చి విపరీతంగా పెరిగి పోయాయి అని చెప్పారు బియ్యం రేట్లు, కూరగాయలు ధరలు కూడా పెరిగాయని చెప్పారు. సన్న బియ్యం ఇస్తామని బియ్యం ధరలని పెంచారని చెప్పారు. మార్కెట్లో సన్న బియ్యం కిలో 60 నుండి 64 కి పెరిగింది అన్నారు. బ్లాక్ మార్కెట్ నియంత్రించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading