అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి జంటగా నటించిన సినిమా దేవదాస్. సావిత్రి సుదీర్ఘ సినీ చరిత్రలోనే ఈ సినిమా సాధించిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమికుడిగానే కాకుండా అహంకారిగా, తాగుబోతుగా దేవదాసు పాత్రలో నాగేశ్వరరావు లీనమైన ఈ సినిమా తెలుగులో లో 365 దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక రికార్డులను సొంతం చేసుకుంది. భారత దేశ వ్యాప్తంగా నాటి నుంచి నేటి వరకు ఎన్నో భాషల్లో 12కు పైగా దేవదాసులు వచ్చాయి. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, ఐశ్వర్య కూడా జంటగా దేవదాసు కలిసి చేశారు. ఎన్నో దేవదాసులు వచ్చినా కూడా భారత సినీ జనాలు మాత్రం ANR ను మాత్రమే దేవదాసుగా ఊహించుకున్నారు. అంటే దేవదాసు పాత్రలో ఆయన ఎంతగా లీనమై పోయారు తెలుస్తుంది.
Advertisement
సినిమా వెనక ఓ కథ చాలా రోజుల ఇండస్ట్రీలో నడిచింది.దేవదాసు సినిమా దర్శకుడు వేదాంతం రాఘవయ్య, నిర్మాత డి.ఎల్ నారాయణ ఈ సినిమాను తెలుగు తమిళంలో ఒకేసారి తీశారు. అయితే వేదాంతం రాఘవయ్య కు యువ ఎన్టీఆర్ ఆర్ అంటే అత్యంత ఇష్టం. ఏ వేషం వేసినా ఇట్టే ఇమిడి పోతాడు అనే పేరు కూడా అన్నగారికి ఉంది. దీంతో తో తొలుత దేవదాసు సినిమా గురించి చర్చించి నప్పుడు ఎన్టీఆర్ ను అనుకున్నారట. ఇక సావిత్రి వేషధారణ కూడా సావిత్రి కాదు. ఆ పాత్రకు తొలుత భానుమతిని అనుకున్నారు. ఎందుకంటే దేవదాసు సినిమాలో హీరో ఎంత పొగరు గా ఉంటాడో, హీరోయిన్ కూడా అంతే. కాబట్టి ఈ పాత్రకు భానుమతి అయితే సరిపోతుందని రాఘవయ్య అనుకొన్నారు. అంతే దానిని బట్టి సీను రాసుకుంటూ పోయారు. ఎన్టీఆర్ ను వాహినీ స్టూడియోకు పిలిచి తొలి షూట్ కూడా తీశారు. అయితే ఈ కథలో చేసిన మార్పులు తర్వాత కాలంలో ఎన్టీఆర్ కు నచ్చలేదంట. కేవలం హీరోను తాగుబోతుగా చూపించడాన్ని సహించలేక, సినిమా నుంచి విరమించుకున్నారు. ఇక భానుమతి ఫుల్ బిజీగా ఉండడంతో కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు.
ఈ నేపథ్యంలోనే అన్నగారు ఈ సినిమాను వదులుకున్నారని, అప్పటి ఇండస్ట్రీ జనాలు చర్చించుకునేవారు. చివరకు ఆ కథ ఏఎన్ఆర్ వద్దకు వెళ్లడం, ఆయన సినిమాను చేయడం, చరిత్ర లో ఎప్పటికీ నిలిచిపోయే హిట్ కొట్టడం జరిగిపోయాయి. అయితే దేవదాసు చిత్రాన్ని ఎన్నో భారతీయ భాషల్లో నిర్మించి ఇప్పటికీ చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించి, కేవలం అక్కినేని నాగేశ్వరరావు గారినే చెప్పుకుంటారు జనాలు.తెలుగునాట బహుళ ప్రజాదరణ పొంది దేవదాసు నవలలను వినోదా వారు సినిమాగా రూపొందించాలి అనుకున్నప్పుడు, ఆ పాత్రకు అక్కినేని గారని కథానాయకుడిగా ఎంపిక చేశారు. అప్పుడు చాలా మంది నిర్మాతలు డి.ఎల్ నారాయణ, దర్శకుడు వేదాంతం రాఘవయ్య కు అక్కినేని ఆ పాత్రకు పనికిరాడు, అతన్ని తీసేయండి అని సలహా ఇచ్చారట. కానీ వారిని లెక్కచేయకుండా అక్కినేనితో నే ఆ సినిమాను నిర్మించారు. ఆ చిత్రం గొప్ప సంచలనం సృష్టించింది.
Advertisement
అయితే ఆ చిత్రంలో లో జగమే మాయ పాట చిత్రీకరణలో నిజంగానే అక్కినేని గారు తాగి చేశారని చెప్పుకునేవారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇది గొప్ప ప్రచారంలో కూడా ఉండేది. అయితే ఆ పాట చిత్రీకరణ రాత్రి సమయంలో జరిగిందని అక్కినేని కడుపునిండా భోజనం చేసి షూటింగ్ లో పాల్గొనే వాడట. నిద్రకు కళ్ళు మూసి మూతలు పడుతుండేవట. అలాంటి సమయంలో తీసిన పాట అని చిత్ర సభ్యులు చెప్పుకునేవారు. అంతేకాకుండా దేవదాసు సినిమా వాళ్ళు ఇంకో అద్భుతమైనా విషయం జరిగింది. అది టాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒక్కరైనా అక్కినేని నాగేశ్వరరావు హీరోగా స్థిరపడి, మంచి పేరు పొందిన తరువాత అప్పట్లో చెన్నై లో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను, మన హైదరాబాద్ కు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ తర్వాత ఆయన చెన్నై వదిలి హైదరాబాద్ కు చేరుకోవడం, అనంతరం అక్కడే అన్నపూర్ణ స్టూడియో ను నిర్మించడం జరిగాయి.
అయితే అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం వెనకాల ఉన్న అసలు విషయాలను సీనియర్ జర్నలిస్టు ఒకరు మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాట్లాడుతూ చెప్పారు. గతంలో అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రి ఈ కాంబినేషన్ లో వచ్చిన గొప్ప చిత్రం దేవదాసు. ఈ సినిమా గురించి తెలియని తెలుగువారు ఉండరు.నాగేశ్వరరావు పూర్తిగా హైదరాబాదుకు వచ్చిన తర్వాతి సమయంలో లో ఈ సినిమా నిర్మాత తమ సినిమా హక్కులను వేరొకరికి అమ్ముదామని నిర్ణయించి పలువురు సినిమా వారిని సంప్రదించారట. అయితే చివరికి నాగేశ్వర రావు గారే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేయడం జరిగింది. నిజానికి అంతకు ముందు వరకు సినిమాలన్నీ నవయుగ సంస్థ ద్వారానే రిలీజ్ అయ్యే వని అయితే ఉన్నట్లుండి ఆయన కొనుగోలు చేసిన దేవదాస్ ఓల్డ్ మూవీ రైట్స్ తో సినిమాను మరొకసారి రీ రిలీజ్ చేయాలని భావించిన నాగేశ్వరరావు, అప్పుడే కొత్తగా తన భార్య అన్నపూర్ణ గారి పేరు మీద డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏర్పాటు చేసి, దానిద్వారా దేవదాస్ ను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా అదే సమయంలో కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన దేవదాసు కూడా రిలీజ్ అయింది. కాగా ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అవ్వగా.. పాత దేవదాస్ ఒక్కసారి అద్భుతంగా హిట్ కాగా, కృష్ణ గారి దేవదాస్ ఫెయిల్ అయిందట. అయితే కృష్ణ సినిమా దేవదాస్ మాత్రం నవయుగ సంస్థ ద్వారా రిలీజ్ అయింది.
నాగేశ్వరరావు తన సొంత సంస్థ ద్వారా పాత దేవదాసు ను రిలీజ్ చేయడంతో, నవయుగ ఫిలిమ్స్ కు చెందిన హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ఇకపై నాగేశ్వరరావు గారు సినిమాలు చిత్రించడానికి వీలులేదని నిర్ణయించారట. దాంతో అప్పటి నుంచి నాగేశ్వరరావు గారి సినిమాలు హైదరాబాద్ లో తీయడానికి వీలు లేకుండా పోయిందని, అందువల్ల అప్పట్లో బెంగుళూరు మరియు ఊటీ లలో ఆయన సినిమాలు చిత్రీకరించేవారు అని చెప్పుకొచ్చారు.అటువంటి పరిస్థితులు ఇకపై ఉండకూడని, హైదరాబాదులో కూడా తన స్టూడియో ఉండాలని గట్టి పట్టుదలతో నాగేశ్వరరావు తన భార్య అన్నపూర్ణ పేరు మీద స్టూడియోకి శంకుస్థాపన చేసి కొద్ది నెలల్లోనే దాని నిర్మాణం పూర్తి చేసి, అక్కడి నుండి తన సినిమాలను ఇందులోనే చిత్రీకరించడం మొదలుపెట్టారట. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఏంటంటే, కృష్ణ గారి దేవదాసు సినిమా ఇన్ డైరెక్ట్ గా, నాగేశ్వరరావుగారి అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి కారణమైందని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read :
మే నెలలో విడుదలైన మహేష్ బాబు సినిమాలు ఇవే..!