తమన్నా భాటియా… ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సారాలు దాటిపోయింది. పదోతరగతి చదివే సమయంలో ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్ వచ్చింది. దీనితో పాటు పలు యాడ్స్ చేసే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తమన్నా ఒక సినిమాకు కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
అయితే, తమన్నా మొదట చేసిన యాడ్‌కు సుమారు లక్ష రూపాయలు తీసుకుందట. పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు ఈ ఆఫర్ లభించింది. సంపాదించిన ఆ డబ్బుతో తమన్నా తన కుటుంబసభ్యులతో కలిసి కాఫీ షాప్‌కు వెళ్ళి ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసిందట. యాడ్, శ్రీ సినిమా తరువాత వరసగా ఆమెకు సినిమా ఆఫర్లు వచ్చాయి. మంచి సినిమాలు ఎంచుకోని నటించడం మొదలుపెట్టింది. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. దక్షిణాది, ఉత్తరాది సినిమా అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోలతో కలిసి నటిస్తోంది తమన్నా. మరో నాలుగేళ్లపాటు హీరోయిన్‌గా చలామణి అయ్యే అవకాశం ఉన్నది. ఈ నాలుగేళ్లలో వీలైనన్ని సినిమాలు చేసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతానని చెబుతోంది మిల్కీబ్యూటి.
Ads
previous post