Home » లైగర్ కోసం మైక్ టైసన్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

లైగర్ కోసం మైక్ టైసన్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

by Azhar
Ad
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్. ఈ సినిమాలో విజయ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. వాటికీ తోడు ఇందులో మైక్ టైసన్ నటిస్తున్నాడు అని చిత్రబృందం ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా అవి ఆకాశానికి తాకాయి అనే చెప్పాలి.
కానీ ఈ సినిమా అనేది విడుదల తర్వాత మొత్తం మారిపోయింది. ఆకాశం నుండి పాతాళానికి పడిపోయింది సినిమా. పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక చాలా అభిమానులు అయితే మైక్ టైసన్ విషయంలో చాలా నిరాశ చెందారు. ఎంతో హైప్ చేసిన ఆయనను తీసుకువచ్చి చివరకు ఆయనతో కామెడీ చేయించారంటూ సీరియస్ అయ్యారు. అయితే మైక్ టైసన్ తో తీసిన క్లైమాక్స్ సినిమాకు పెద్ద దెబ్బ కొట్టింది అని ఎంతో మంది అన్నారు.
అయితే సినిమా అనేది ఎలా ఉన్న మైక్ టైసన్ వంటి వ్యక్తిని సినిమాలోకి తీసుకురావడం పెద్ద విషయ అనే చెప్పాలి. కానీ అంత పెద్ద సెలబ్రెటీని తీసుకువస్తునపుడు రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ లైగర్ సినిమా కోసం మైక్ టైసన్ తీసుకున్న పారితోషకం ఎంత అంటే.. అక్షరాలా 23 కోట్లు అని తెలుస్తుంది. ఇది హీరో విజయ్ తీసుకునేదానికి ఏ మాత్రం తక్కువ కాదు అని సమాచారం.

Advertisement

Visitors Are Also Reading