Home » కోహ్లీ సెంచరీ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ షాకింగ్ కామెంట్స్..!

కోహ్లీ సెంచరీ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ షాకింగ్ కామెంట్స్..!

by Azhar
ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయక.. మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. అలాగే ఈ మూడేళ్ళలో కోహ్లీ బ్యాటింగ్ లో బాగా మార్పులు అనేవి వచ్చాయి. పరుగులు చేయడనికే కాదు.. క్రీజులో నిలబడటానికి కూడా కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కువ మ్యాచ్ లలో టేలెండర్ల మాదిరిగా ఇలా వచ్చి… అలా ఔట్ అయిపోతున్నాడు. దాంతో కోహ్లీ బ్యాటింగ్ పై సర్వత్రా విమర్శలు అనేవి వస్తున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా వెళ్తున్న కోహ్లీ.. బ్యాట్ తో మాత్రం బదులు ఇవ్వలేకపోతున్నాడు.
అయితే ఇప్పుడు కోహ్లీ బ్యాటింగ్ పై ఇంగ్లాండ్ వివాదాల కామెంటేటర్ గా పేరు తెచ్చుకున్నా మైఖేల్ వాన్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసాడు. మాములుగా మైఖేల్ కు సందు దొరికితే చాలు మన ఇండియన్ క్రికెటర్స్ ను విమర్శిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు అతను ముందు మన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ అనేది ఉంది. అతను వదులుతాడా.. లేదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మైఖేల్ మాత్రం ఇప్పుడు చేసిన కామెంట్స్ తో అందరూ షాక్ కు గురవుతున్నారు.
తాజాగా మైఖేల్ వాన్ మాట్లాడుతూ.. కోహ్లీని మీరు 30 పరుగులు చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. కోహ్లీ 30 పరుగులు చేసే వరకు క్రీజులో కనుక కుదురుకుంటే.. ఆ తర్వాత అతడిని సుచరి చేయకుండా ఆపడం కష్టం అని అన్నాడు. దీంతో కోహ్లీని విమర్శించకుండా.. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లను జాగ్రత్తగా ఉండమనటం భారత అభిమానులను చాలా షాక్ కు గురి చేస్తుంది. అయితే ప్రపంచంలో ప్రతి క్రికెట్ జట్టుకు తెలుసు. ఒకవేళ మీరు కోహ్లీని క్రిటిసైజ్ చేస్తే.. దాని పరిణామం ఎలా ఉంటుంది అనేది.
Visitors Are Also Reading