Home » అప‌రిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమ‌నించారా..?

అప‌రిచితుడు సినిమాలో ఈ మిస్టేక్ గమ‌నించారా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఇండియాలో రాజ‌మౌళి టాప్ డైరెక్ట‌ర్ గా ఉన్నాడు. కానీ జ‌క్క‌న్న కంటే ముందు పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్. ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి శంక‌ర్ టాప్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. ఇక శంకర్ త‌న సినిమాల‌కు సోష‌ల్ మెసేజ్ ను కూడా కచ్చితంగా జోడిస్తాడు. ప్ర‌తి సినిమాలోనూ శంకర్ ఓ మేసేజ్ ఇస్తాడు. ఇక శంక‌ర్ తీసిన అద్భుత‌మైన సినిమాల‌లో అప‌రిచితుడు ఒక‌టి.

Advertisement

 

ఈ సినిమాను శంక‌ర్ సౌత్ లోని అన్ని భాష‌ల్లో విడుద‌ల చేశాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విక్ర‌మ్ హీరోగా నటించ‌గా హీరోయిన్ గా స‌దా న‌టించింది. సినిమాలోని పాట‌లు సినిమా క‌థ‌..యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇలా ప్ర‌తి ఒక్క‌టి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో విక్ర‌మ్ అప‌రిచితుడి పాత్ర‌లో ఇర‌గ‌దీశాడు. మూడు పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అలాక్క‌య్యేలా చేశాడు.

Advertisement

ఆ మూడు పాత్ర‌ల‌లో ఒక‌టి రాము…మ‌రొక‌టి రెమో..మూడో పాత్ర అప‌రిచితుడు. రాము ఎక్క‌డ అన్యాయం జ‌రిగినా చూస్తూ ఉండ‌లేడు. కానీ చాలా సౌమ్యుడు రూల్స్ మాట్లాడుతుంటాడు. ఇక రెమో ల‌వర్ బాయ్…అంతే కాకుండా అప‌రిచితుడు అన్యాయం చేసే వాళ్ల‌ను ఎదిరిస్తూ వాళ్ల అంతు చూస్తాడు. అయితే రాము సినిమాలో చాలా రూల్స్ మాట్లాడుతాడు అన్న సంగ‌తి తెలిసిందే. చిన్న త‌ప్పును కూడా భ‌రిచలేడు.

లాయ‌ర్ కావ‌డంతో ఓ సారి బైక్ వైర్ తెగితేనే ఆ కంపెనీని కోర్టుకు లాగుతాడు. కానీ సినిమాలో రాము బండి న‌డిపేట‌ప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోడు. అప్పుడు సినిమాలో దీన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు కానీ ప్ర‌స్తుతం ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అన్ని రూల్స్ మాట్లాడి హెల్మెట్ ధ‌రించ‌లేదా అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

ALSO READ : వైరల్ అవుతున్న ‘బాల రామాయణం’ నటుల ఫోటోలు..!

Visitors Are Also Reading