Home » MI vs RCB మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా..? టాస్ కూడా ఫిక్సింగ్ ఆ..?

MI vs RCB మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా..? టాస్ కూడా ఫిక్సింగ్ ఆ..?

by Sravya
Ad

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి ఘోరంగా ఉంది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు మ్యాచ్లు ఓటమిపాలయ్యారు. జట్టు నిండా స్టార్స్ ఉన్న మ్యాచ్ ని మాత్రం గెలవలేక పోతున్నారు. వీళ్ళ పరాజయానికి చాలా కారణాలే చెప్పొచ్చు. గురువారం ముంబై తో జరిగిన మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ ని కావాలని ఓడించాలని ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆర్సీబీ విషయంలో కుట్రలు జరిగాయని అన్ని రకాలుగా ఆర్సీబీ జట్టును మోసం చేసి ముంబై గెలిచిందని నెట్టింట దుమారం రేగుతోంది. టాస్ విషయంలో కూడా ముంబై జట్టు మోసం చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్లో టాస్ దగ్గర నుండే ముంబై ఇండియన్స్ జట్టు కుట్రలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ముంబై జట్టు టాస్ ఓడిపోతే గెలిచినట్లు చూపించాలని విమర్శలు కూడా వస్తున్నాయి. సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో మాయమైంది. కాయిన్ గాల్లోకి ఎగరేసిన తర్వాత డూప్లెసెస్ టైల్ అని చెప్పారు అయితే రిఫరీ వెళ్లి కాయిన్ తీసుకుని హార్దిక్ పాండ్యా గెలిచినట్లు చెప్పారు. హార్దిక్ పాండ్యా మేము బౌలింగ్ చేస్తామని చెప్పాడు కానీ ఆ వీడియోని కనుక సరిగ్గా చూసినట్లయితే రిఫరీ కాయిన్ లిఫ్ట్ చేసినట్లు కనపడుతుంది అని ఫ్యాన్స్ కోప్పడుతున్నారు.

Advertisement

నిజానికి బెంగళూరు జట్టు టాస్ గెలిస్తే ముంబై ఇండియన్స్ టాస్ ముంబై గెలిచిందని రిఫరీ చెప్పారని విమర్శలు కూడా వస్తున్నాయి. కింద పడిన కాయిన్ ని కావాలని తిప్పి చూపించారని అందరూ అంటున్నారు. ఈ టాస్ ఒకటే కాదు ఇంకా ఎంపైర్లు చేసిన మోసాలు కూడా చాలా ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు. దినేష్ కార్తీక్ వేసిన బంతిని నో బాల్ అయినా కూడా నో బాల్ ఇవ్వలేదని ముంబై బెటర్ కి వేసిన ఫెయిర్ డెలివరీ ని వైడ్ గా ప్రకటించారని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మరి ఈ ఆరోపణల మీద ముంబై యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading