Home » అప్పుడు మెగా ఖర్చులు…ఇప్పుడు చిరు సాయం కోసం ఎదురు చూపులు…!

అప్పుడు మెగా ఖర్చులు…ఇప్పుడు చిరు సాయం కోసం ఎదురు చూపులు…!

by AJAY
Ad

తమ అభిమాన హీరోల సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ కొనుక్కుని మరీ చూస్తారు. మరికొందరు తమ సొంత డబ్బులతో పాలాభిషేకాలు చేయడం..బ్యానర్ లు కట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే ఒక స్థాయి వరకు తమ హీరోల కోసం ఖర్చు చేస్తే ఎలాంటి నష్టం ఉండదు కానీ….తమ స్థాయికి మించి అభిమానం ప్రదర్శిస్తే చివరికి కట్టుబట్టలతో మిగలాల్సిందే… ఈ స్టోరీనే అందుకు నిదర్శనం… వివరాల్లోకి వెళితే… మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని భవాని నగర్ కాలనీకి చెందిన బట్టు బాలాజీ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని.

Megastar fan balaji

Megastar fan balaji

చిరంజీవి సినిమా విడుదల అయిందంటే ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ కొనుక్కొని సినిమా చూడాల్సిందే. అంతేకాకుండా అభిమాన హీరో పిలుపునిస్తే తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహించే వాడు బాలాజీ. చిరంజీవి హీరోగా నటించిన స్టేట్ రౌడీ సినిమా సమయంలో టికెట్ల కోసం నిలబడితే తోపులాటలో ఎడమ కన్ను పోయింది. చిరంజీవి హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే మానుకోట పట్టణం నుండి తన సొంత ఖర్చులతో 150 మందిని తీసుకు వెళ్లి బాలాజీ రక్త దానం చేయించాడు. అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ కోసం తన మూడెకరాల భూమిని అమ్మేసి ఖర్చు చేశానని బాలాజీ చెబుతున్నాడు.

Advertisement

Advertisement

Also read : సిరివెన్నెల రాసిన చివరి పాట ఎప్పుడు వస్తోందంటే…?

తన తండ్రి ఆస్తి… తాను సంపాదించిన డబ్బులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు చిరంజీవి ఫ్యాన్స్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేశానని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం బతుకుదెరువు కోసం తన పిల్లలు ఇతరుల ఇండ్లలో పనిచేస్తున్నారని తన భార్య కూరగాయలు అమ్ముతుందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తాను మెగాస్టార్ సాయం కోసం వెళితే అడ్డుకుంటున్నారని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక సారి చిరంజీవికి కలిసి ఆయనకు తన సమస్యలను చెప్పుకుంటానని బాలాజీ కోరుతున్నాడు.

Visitors Are Also Reading