Home » ఈ ముగ్గురు అక్క చెల్లెలతో కలిసి నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరో ఎవరంటే ?

ఈ ముగ్గురు అక్క చెల్లెలతో కలిసి నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరో ఎవరంటే ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా మూడు ద‌శాబ్దాలుగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ మ‌ధ్య యంగ్ హీరోలు దుమ్మురేపుతున్న స‌మ‌యంలో త‌న‌లోని గ్రేస్ ఏమాత్రం త‌గ్గ‌లేదంటాడు చిరంజీవి. తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టాడు.

Advertisement

మ‌రొక వైపు దాస‌రినారాయ‌ణ‌రావు తరువాత చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సినీ పెద్ద‌గా అండ‌గా ఉంటున్నాడు. అంతేకాదు.. త‌న కెరీర్‌లో కాస్త అరుదైన రికార్డులను నెల‌కొల్పాడు. అక్కాచెల్లెల్లు అయిన ముగ్గురు హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించి వారెవ్వా అనిపించాడు. ఆ హీరోయిన్‌లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read :  త‌మిళ్ లో ఫ్లాప్ అయిన 5 టాలీవుడ్ సూప‌ర్ హిట్ సినిమాలు…!

న‌గ్మా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌చ్చిన సినిమా ఘ‌రానా మొగుడు. తెలుగు ప‌రిశ్ర‌మ‌లో బాక్సాఫీస్ రికార్డుల‌ను క్రాస్ చేసింది ఈ సినిమా. ఈ చిత్రంలో న‌గ్మా, చిరంజీవి మ‌ధ్య రొమాన్స్ అప్ప‌ట్లో హాట్ టాపిక్‌గా మారాయి. న‌గ్మాపై చిరు పంచ్‌లు, ఒక‌రిపై మ‌రొక‌రు చేసుకునే ఛాలెంజ్‌లు సినిమా రేంజ్‌ను భారీగా పెంచాయి. చిరంజీవితో న‌గ్మా కెరీర్‌లో ఈ సినిమా ప్ర‌త్యేకంగా నిలిచింది.

Advertisement

రోషిణి

నగ్మా సోద‌రి రోషిణి. ఈమె తెలుగులో త‌క్కువ సినిమాలే చేసింది. అయినా మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి న‌టించింది. మాస్ట‌ర్ సినిమాలో రోషిణి మెస్టార్‌తో జ‌త‌క‌ట్టింది. ఈ సినిమాలో ఆమె ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో దర్శనం ఇస్తుంది. సినిమాతో రోషిణికి మంచి పేరు వచ్చింది. మాస్టర్ సినిమా చిరంజీవి కూడా చాలా ప్లస్ అయింది.

జ్యోతిక

నగ్మా మరొక సోదరి జ్యోతిక ఈమె కూడా తెలుగు లో చాలా సినిమాలు చేసింది. చిరంజీవి ఠాగూర్ సినిమా లో జ‌త‌క‌ట్టింది. అప్పట్లో ఈ సినిమా తెలుగు పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. మొత్తంగా ముగ్గురు అక్కాచెల్లెల్ల‌తో చిరంజీవి రొమాన్స్ చేశాడు. అటు బాలయ్య కూడా ఈ ముగ్గురిలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల తో కలిసి నటించాడు. నగ్మా తో కలిసి అశ్వమేధం, రోషిణితో పవిత్ర ప్రేమ లో నటించాడు. జ్యోతిక తో కూడా సనిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :  బాలీవుడ్ కి చమటలు పట్టించిన మెగా స్టార్ సినిమా అది ! కలెక్షన్స్ చూసి అమితాబ్ ఏమన్నారంటే ?

Visitors Are Also Reading