మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో మొగల్తూరులో పుట్టి పెరిగిన ఈయన సినిమాల పై ఉన్నఆసక్తితో మద్రాస్ వచ్చి నటనలో శిక్షణ పొందారు. ఓ రెండేండ్ల పాటు మాత్రమే ఈయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలని, కుదరని పక్షంలో తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోవాలని డిసైడ్ అయ్యారు.
Advertisement
ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈయన కష్టానికి తగ్గ ఫలితం అనుకూలంగా వచ్చింది. మొదట్లో నెగిటివ్ రోల్స్ సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన ఈయన తరువాత హీరోగా మారారు.
1978 వ సంవత్సరం నుండీ ఇ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూనే వచ్చారు అదే క్రమంలో ఖైదీ చిత్రం వచ్చి హిట్ అయ్యి ఈయనకి స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది అటు తర్వాత ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ వరుసగా హిట్లు కొడుతూ వచ్చారు అయితే 1994, 95 సంవత్సరాల్లో ఈయన నటించిన సినిమాలు ఎస్.పి.పరశురాం బిగ్ బాస్ రిక్షావోడు ఫ్లాపులు అయ్యాయి ఒక్క ముగ్గురు మొనగాళ్ళు యావరేజ్ గా నిలిచింది.
Advertisement
ఈ సమయంలో చిరుపై చాలా విమర్శలు వెల్లువెత్తాయి చిరంజీవి పని అయిపోయింది అని ఆయన ఇట్లు కొట్టడం ఇక కష్టమే అని ఇలా ఘోరమైన కామెంట్లు చాలానే వినిపించాయి చిరు కూడా ఆ టైములో ఫ్యామిలీ రాజశేఖర్ లా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని మా సినిమాల జోలికి పోకూడదని భావించారట దాంతో 1996వ సంవత్సరం మొత్తం ఆయన కథలు వినడానికి డిసైడ్ అయ్యారు. కొంత గ్యాప్ తీసుకున్న పరవాలేదు కొట్టాలని భావించారు చిరు.
అలా మలయాళంలో మమ్ముట్టి నటించిన హిట్లర్ మూవీ కథ విన్నారు మొదట ఈ ప్రాజెక్ట్ మోహన్ బాబు ఈ వివి సత్యనారాయణ కాంబినేషన్ లో రూపొందుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ వాళ్ల కాంబోలో అప్పటికే మరో సినిమా రూపొందుతుండడంతో అది జరగలేదు. అలా అది చేతులు మారుతూ.. ముత్యాల సుబ్బయ్య చేతులకి వెళ్ళింది 1997వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
Also Read : ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయట..!