Telugu News » ఆలస్యంగా వివాహం చేసుకోవడం వ‌ల్ల ఈ సమస్యలు వస్తాయట..!

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వ‌ల్ల ఈ సమస్యలు వస్తాయట..!

by Anji

పెళ్లి ఆల‌స్యం అయితే పిల్ల‌లు ఆల‌స్యం.. పిల్ల‌లు ఆల‌స్యం అయితే వృద్దాప్యం వ‌య‌సులో పిల్ల‌ల‌ను చూసుకోవ‌డం అంటే చాలా బాధ‌క‌రంగా ఉంటుంది. త‌రువాత పిల్ల‌లు తొంద‌ర‌గా సెటిల్ కారు. ఇంకా చ‌దువుల్లో ఉంటారు. త‌ల్లిదండ్రుల‌కేమో వృద్ధాప్యం వ‌స్తుంది. వీళ్లు వారి మీదే ఆధార‌ప‌డాలి. ఇంకా పిల్ల‌లు కూడా వీరిమీదనే ఆధార‌ప‌డుతుంటారు. అందుకే త‌గిన స‌మ‌యంలోనే పెళ్లి చేసుకోవాలి.

Ads

Also Read : ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు చాల అదృష్టవంతులట ! వారి పై లక్ష్మీదేవి కృప ఎప్పటికి ఉంటుందట !


జీవ ప‌రిణామ సిద్దాంతం ప్ర‌కారం.. డార్విన్ స్ట్ర‌గుల్ ఫ‌ర్ ఎగ్జిస్టెన్సీ అని చెప్పారు. ఇప్ప‌టికీ ఎగ్జిస్టెన్సీ స్ట్ర‌గుల్ స‌ర్దుకున్న జాతులు మిగిలాయి. స‌ర్దుకోలేని జాతులు అంత‌రించిపోయాయి. పోతున్నాయి కూడా. జీవ‌ప‌రిణామాణ సిద్దాంత ప్ర‌కారం.. జీవితంలో మ‌నం ప్ర‌తిసారి స‌ర్దుకుని పోతున్నాం. పెళ్లి విష‌యంలో మ‌నం ఎందుకు స‌ర్దుకుపోము. నీ పై అధికారి నీమీద పెత్త‌నం చేస్తుంటే నోరు మూసుకుని పోతుంటాం. నీ కింద ప‌ని చేసేట‌టువంటి వారు నీ మాట విన‌క‌పోతే అయ్యా బాబు అని బ్ర‌తిమాలుకుంటాం. కానీ ఇంట్లో వారితో స‌మ‌స్య ఏమిటంటే..? అక్క‌డ స‌ర్దుకుపోయి ఇక్క‌డ ఎందుకు స‌ర్దుకుపోవాల‌నుకుంటారు.

వాస్త‌వానికి ఇక్క‌డ స‌ర్దుకుపోతేనే అక్క‌డ బాగా స‌ర్దుకుపోవాల్సిన అవ‌స‌రం లేకుండా నువ్వె స‌ర్ద‌గ‌ల‌వు అన్న శ‌క్తి వ‌స్తాయి. నువ్వు స‌ర్దుకున్న‌ది కాకుండా ఇత‌రుల‌కు స‌ర్ద‌గ‌ల‌వు. ఇక్క‌డ స‌ర్దుకోలేక‌పోవ‌డం వ‌ల్ల అక్క‌డ స‌ర్దుకోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా చిన్న‌త‌నంలో 15 సంవ‌త్స‌రాల నుంచి 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు మ‌ధ్య‌లోపు మంచి జీవితం, రంగుల క‌ల‌గా ఊహించుకుంటుంటే ఒక ఆడ‌పిల్ల అయితే భ‌ర్త ఆర‌డ‌గుల అంద‌గాడు కావాల‌ని తాను ఎలా ఉన్నా ప‌ర‌వాలేద‌నుకుంటుంది. కానీ తానే ఉద్యోగం చేసుకున్నాక భ‌ర్త నుంచి ఏమి ఆశిస్తుంది. ఆడ‌పిల్ల‌లు కోరుకునేది ఏమిటంటే.. త‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాని కంటే భ‌ర్త ద‌గ్గ‌ర ఎక్కువుండాల‌ని కోరుకుంటుంది.

 

20 ఏళ్ల వ‌య‌స్సులో కావాల్సిన కాంప్ర‌మైజ్ 30 ఏళ్లు 40 ఏళ్ల వ‌య‌స్సులో అవుతున్నారు. ఎంత కాంప్ర‌మైజ్ అవుతున్నారంటే.. చాలా భ‌యంక‌ర‌మైన కాంప్ర‌మైజ్ అవుతున్నారు. వారిని చూసి చాలా బాధ వేస్తుంది. అందువ‌ల్ల త‌ప్ప‌నిస‌రిగా పెళ్లి చేసుకోవ‌డం లేదంటే ఆ మాట అన‌క‌పోతే మొద‌ట్లో సిగ్గు ప‌డ‌తారు. ఇప్పుడు పెళ్లి ఏమిటి అన్న‌ట్టుగా ఉంటారు. పెద్ద‌లు అడ‌గ‌డం మానేస్తే పిల్ల‌లు అడ‌గ‌డం మొహ‌మాటం ప‌డుతారు. అందుకే పెద్ద‌వారే దాని గురించి క‌ల్పించుకుని ప‌లుక‌రించారు. సంబంధాలు చూస్తున్నామంటే నాకు ఎందుకు అంటారు. ఏ ఆడ‌పిల్ల అయినా పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా చెప్ప‌దు. ఒక‌వేళ అంటే మాత్రం వారిని కాంప్ర‌మైజ్ చేయాలి.


స‌ర్దుకోవ‌డం అన్న అల‌వాటు లేక‌పోవ‌డం వీల్ల‌నే చాలా ప్ర‌ధానంగా చూడ‌డం వ‌ల్ల ఈ స‌ర్దుబాటు లేక‌పోవ‌డం వ‌ల్ల పెళ్లి చేసుకున్నాక అత‌ని వైఫ్ ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌ద‌ని అనుకుంటారు. అవ‌స‌రం వ‌స్తే ఎవ్వ‌రూ చూస్తారు. త‌ల్లిదండ్రి రాలేక‌పోతే.. ఇద్ద‌రో ముగ్గురో పిల్ల‌లున్నారు. ఈ అమ్మాయికి అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు అమ్మ‌నాన్న ఈ అమ్మ‌యి ద‌గ్గ‌రికి వెళ్ల‌లేనిప‌రిస్థితి ఉంటే అత్త‌గారి వైపు ఎవ్వ‌రో ఒక‌రు ఉంటే.. క‌నీసం ప‌లుక‌రించే వారుంట‌రు. ఎటువంటి మాన‌వ సంబంధాలు ప‌ట్టించుకోన‌టువంటి ప‌రిస్థితి వ‌స్తుంది క‌నుక కొంచెం దానిని స‌ర్ది చెప్పాల్సిన అవ‌స‌రం ఉంది.

Also Read :  కొత్త కారు కొన్న జబర్దస్త్ శాంతిస్వరూప్.. దాని గురించి ఏమ‌న్నారంటే..?


You may also like