ఏపీలో సినిమా టికెట్ల అంశంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ టికెట్ల ధరలను నియంత్రించడం పెద్ద సినిమాలకు సమస్యగా మారింది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దాంతో పలువరు హీరోలు దర్శకనిర్మాతలు ఈ విధానాన్ని తప్పుడు పడుతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఇటీవల మెగాస్టార్ కు ఏపీ సీఎం జగన్ ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.
Advertisement
chiranjeevi balakrishna
దాంతో మెగాస్టార్ చిరంజీవి రెండు గంటల పాటూ ముఖ్యమంత్రితో చర్చించారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి సీఎం జగన్ సమస్యల పరిష్కారం పై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికే సీఎం జగన్ తో చిరు మళ్లీ సమావేశం అవ్వాల్సి ఉండగా ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో వాయిదా పడింది.
Ad
Advertisement
అయితే ఈ వారంలో చిరంజీవి సీఎం జగన్ తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం కోసం చిరంజీవి సింగిల్ గా వెల్లకుండా మరి కొందరు సినీపెద్దలతో కలిసి వెళ్లబోతున్నారట. ఈ నేపథ్యంలోనే చిరు బాలయ్య, అల్లు అర్జున్, మహేశ్ బాబుతో పాటూ కొందరు డిస్ట్రిబ్యూటర్ లు నిర్మాతలకు ఫోన్ లు చేసినట్టు కూడా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ కలిసి వెళితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సమస్యలను వివరించడం కూడా సులభం అవుతుందనే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టు తెలుస్తోంది.