Home » ఇండియన్ సినిమా అనేది ఒక మతం… రాజమౌళి దానికి పీఠాధిపతి : మెగాస్టార్

ఇండియన్ సినిమా అనేది ఒక మతం… రాజమౌళి దానికి పీఠాధిపతి : మెగాస్టార్

by Azhar
Ad

తెలుగు సినిమా అభిమానులు రెండు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్. కెజిఎఫ్ 2 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడు అభిమానుల కళ్ళు అన్నీ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమా పైనే ఉన్నాయి. ఈనెల 29వ తారీఖున విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి.

ఈ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే జక్కన గురించి మెగాస్టార్ మాట్లాడుతూ… నేను 1988లో చేసిన రుద్రవీణ అనే సినిమాకు నాకు నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. దానికోసం నేను ఢిల్లీ వెళ్లాను. ఆ అవార్డ్స్ ఫంక్షన్ జరిగే దగ్గర గోడలపై బాలీవుడ్ కు సంబంధించిన చాలా మంది సెలబ్రెటీల ఫోటోలు ఉన్నాయి. అవి చూసి నాకు సంతోషం వేసింది. కానీ మన సౌత్ వాళ్ళు ఎవరు ఉన్నారా అని చూస్తే కేవలం ఎంజీఆర్, జయలలిత ఫోటోలు మాత్రమే ఉన్నాయి, కానీ ఆ సమయంలో మన తెలుగులో కూడా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో గొప్ప నటులు ఉన్నారు. వారి ఫోటోలు అక్కడ లేకపోవడంతో నాకు చాలా అవమానంగా అనిపించింది. ఇండియన్ సినిమాలు అంటే కేవలం బాలీవుడ్ సినిమా లేనా…. సౌత్ లో వచ్చే ప్రాంతీయ సినిమాలకు ఎలాంటి గౌరవం లేదా అని బాధ అనిపించింది.

Advertisement

Advertisement

కానీ ఆ బాధ  నేడు సంతోషంగా మారింది. ఎందుకంటే.. మన తెలుగు సినిమా అంటే కేవలం ప్రాంతీయ సినిమాగా కాకుండా ఇండియన్ సినిమా రేంజ్ కి బాహుబలి. ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి తీసుకెళ్లారు. అటువంటి దర్శకుడు మన తెలుగులో ఉండడం ఎంతో గర్వించదగిన విషయం. ఇండియన్ సినిమా అనేది ఒక మతం అయితే… రాజమౌళి దానికి పీఠాధిపతి అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు,

ఇవి కూడా చదవండి :

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

ఢిల్లీకి షాక్.. కరోనా కారణంగా పాంటింగ్ జట్టుకు దూరం..!

Visitors Are Also Reading