మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ఉన్న వైబ్ ఇంతా అంత కాదు. దేశంలో ఎంతో మంది మెగాస్టార్ ఉన్నా చిరంజీవికి ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్. కానీ, కెరీర్ ప్రారంభంలో చిరంజీవికి ఉన్న ట్యాగ్.. సుప్రీం హీరో. సుప్రీం హీరో అనే ట్యాగ్ నుంచి మెగాస్టార్ అనే బ్రాండ్ నేమ్ రావడానికి చిరంజీవి ఎంతో కష్టపడ్డాడు. చిరంజీవికి మెగాస్టార్ అనే ట్యాగ్ 1988లో మరణంమృదంగం నుంచి వచ్చినా, దానికి ముందు ఆయన చేసిన సినిమాల వల్లే ఈ ట్యాగ్ వచ్చిందని చెప్పొచ్చు.
అప్పట్లో చిరంజీవి గ్రాఫ్ పెంచిన సినిమా ఖైదీ అని ఎవరిని అడిగినా చెబుతారు. ఆ రోజుల్లో కేవలం 25 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. ఏకంగా 8 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి, తెలుగు ఇండస్ట్రీకి వసూళ్ల పరంగా ఒక కొత్త దారి చూపించింది. చిరంజీవి అభిమానులు ఇప్పటికీ కూడా ఖైదీ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది. అవును మీరు విన్నది నిజమే. ఖైదీ రాబోతుందని టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement
ఖైదీ సీక్వెల్ ఫై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఉన్నారట. ఖైదీ మూవీ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఈ జన్మ పగ కోసం.. వచ్చే జన్మ నీ కోసం. ఈ డైలాగ్ తో సినిమాకు ఎండ్ కార్డ్ పడుతుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ను బేస్ చేసుకుని సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ బాధ్యతలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అప్పగించారట చిరంజీవి. అంతే కాదు, త్రివిక్రమ్ సీక్వెల్ పై పనులు కూడా స్టార్ట్ చేశాడని టాక్.అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం పనిలో ఉన్నాడు. దీని తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఖైదీ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్. అయితే ఆ లోపు ఖాళీ సమయాల్లో సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట.
మరికొన్ని ముఖ్యమన వార్తలు :