Telugu News » సల్మాన్‌ ఖాన్ టైగర్‌-3 రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ.. ఎప్పుడంటే..?

సల్మాన్‌ ఖాన్ టైగర్‌-3 రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ.. ఎప్పుడంటే..?

by Anji

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ టైగర్‌ ప్రాంఛైజీలో నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ట్రెండ్‌ సెట్‌ చేశాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక  ఇదే జోనర్‌లో వస్తున్న తాజా చిత్రం టైగర్‌ 3 . మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. షారుఖ్‌ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ఇప్పటివరకు ఉన్న అప్డేట్. 

అయితే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడు  అనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వస్తున్నారు. కాగా టైగర్‌ 3 విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు.. వెయిట్‌ చేయండి.. అని ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు. పులి గాయపడింది.. అని ట్వీట్‌తో కొన్ని రోజుల క్రితం టైగర్‌ 3 అప్‌డేట్ అందించి అభిమానులను ఖుషీ చేశాడు సల్మాన్ ఖాన్. దేశభక్తి ప్రధాన ఇతివృత్తంతో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసేందుకు యశ్‌ రాజ్‌ ఫిలిం ప్లాన్ చేస్తోంది. 

ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. అశుతోష్‌ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్‌ బేడి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలనాటి అందాల తార రేవతి  చాలా కాలం తర్వాత మరోసారి స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌ షేర్ చేసుకోబోతుంది. టైగర్‌ ప్రాంఛైజీలో ఏక్తా టైగర్‌, టైగర్‌ జిందా హై తర్వాత వస్తున్న సినిమా కావడంతో టైగర్‌ 3పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆంధ్రావాలా సినిమా విషయంలో అలా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది.. ఎడిటర్ కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading