Home » వార్నీ….మెగాస్టార్ లుక్ ను ఎక్క‌డ నుండి కాపీ చేశారో తెలుసా..!

వార్నీ….మెగాస్టార్ లుక్ ను ఎక్క‌డ నుండి కాపీ చేశారో తెలుసా..!

by AJAY
Ad

సోష‌ల్ మీడియా ప్ర‌భావం జ‌నాల మీద చాలా పెరిగిపోయింది. రిల‌య్ మీడియా కంటే జ‌నాలు ఎక్కువగా సోస‌ల్ మీడియానే ఫాలో అవుతున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య సినిమాల‌పై ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. ఈ పాట‌ను అక్కడ కాపీ చేశారు. ఈ సీన్ ను ఇక్క‌డ కాపీ చేశారు అంటూ మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే పాట‌లు సీన్ల విష‌యంలో కొన్ని సార్లు కాపీ కొట్ట‌డం దొరికిపోవ‌డం కామనే…కానీ ఇప్పుడు పోస్ట‌ర్ ల‌ను సైతం ప‌ట్టేసి మీమ‌ర్స్ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

 

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరు ఖైదీ నెం 150 సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. ఈ సినిమా త‌ర‌వాత సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నారు. మ‌రోవైపు చిరు ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమాలో న‌టించారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

 

ALSO READ : మోహ‌న్ బాబు మోకాళ్ల‌పై కూర్చోపెట్టి కొట్టారు…విష్ణు హెయిర్ స్టైలిస్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. మ‌రోవైపు ఈ సినిమా తర‌వాత భోలా శంక‌ర్ అనే సినిమాలో కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. చిరంజీవికి జోడీగా ఈ సినిమాలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తోంది. కాగా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా నుండి పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈ పోస్ట‌ర్ లో చిరు స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. జీప్ ముందు చిరు నిలుచుకున్న పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదిలా ఉండ‌గా ఈ పోస్ట‌ర్ ను ఎన్టీఆర్ హీరోగా న‌టించిన శ‌క్తి సినిమా నుండి కాపీ కొట్టారు అంటూ నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ శ‌క్తి పోస్ట‌ర్ కు భోళాశంక‌ర్ పోస్ట‌ర్ కు కొన్ని పోలిక‌లు ఉండ‌టంతో అక్క‌డ నుండే కాపీ కొట్టార‌ని మీమ్స్ వేస్తున్నారు.

Visitors Are Also Reading