Home » మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి అధికంగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్న నెటిజన్స్..! వారు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారో తెలుసా..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి అధికంగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్న నెటిజన్స్..! వారు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారో తెలుసా..?

by Mounika
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన విషయమే. ఈ నెల జూన్ 9న ఇరుకుటుంబాల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థంతో ఒక్కటయ్యారు. ఎప్పుడైతే మీరు ఎంగేజ్మెంట్ జరిగిందో లావణ్య పై మెగా అభిమానుల మనసులు అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. లావణ్య ఎవరు..? ఆమె కుటుంబ నేపథ్యం ఎలాంటిది..? ఆమె ఏ కులానికి చెందిన వ్యక్తి అంటూ సమాధానాల కోసం గూగుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. మెగా అభిమానుల వెతుకులాటలో లావణ్య త్రిపాఠి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో 1990 డిసెంబర్ 15న జన్మించారు. ఈమె డెహ్రాడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి తీవారి హైకోర్ట్ న్యాయవాది వృత్తిలో స్థిరపడగా , తల్లి బాల తీవారి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసి ఇంట్లోనే ఉంటున్నారు. లావణ్యకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. లావణ్య ముంబైలో రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకుంది. ఆమెకు మొదటి నుంచి మోడలింగ్ మీద ఆసక్తితో సినీ రంగంలోకి ప్రవేశించిది.

Advertisement

ఇక 2006 లో లావణ్య మిస్ ఉత్తరాఖండ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2012 లో అందాల రాక్షసి చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 2017లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా ద్వారా వరుణ్ తేజ్ తో లావణ్యకు పరిచయం ఏర్పడింది. లావణ్య,  నిహారిక జిమ్ మేట్స్ కావడంతో అలా వరుణ్ తో పరిచయం మరింత బలపడింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అంతరిక్షం సినిమాతో వీరి పరిచయం కాస్త లవ్ ట్రాక్ కి దారితీసింది.

lavanya-thripatiవీరిద్దరి ప్రేమ విషయం సీక్రెట్ గా కంటిన్యూ చేసిన సోషల్ మీడియాలో వీళ్ళ లవ్ స్టోరీపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వారిపై వచ్చే వార్త వాస్తవం కాదని అటు వరుణ్ ఇటు లావణ్య ఇద్దరూ కొట్టిపడేశారు. కానీ చివరికి ఆ వార్తలే నిజమయ్యాయి. ఎట్టకేలకు ఈ జంట తమ ప్రేమను నెగ్గించుకొని త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే..?

శోభన్ బాబు జయలలిత లవ్ స్టోరీ.. ఆ డైరీలో ఏముందో తెలుసా ?

హీరో గోపీచంద్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

 

Visitors Are Also Reading