రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ లావణ్య వరుణ్ మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించుకున్నారు. వీరికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వలేదు. వీరిద్దరూ కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడినట్టు ప్రచారం జరుగుతుంది.
Advertisement
ఇటీవల వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరి పైన అటెన్షన్ ఎక్కువగా ఉంది. నిన్న ఫాథర్స్ డే సందర్భంగా లావణ్య త్రిపాఠి తన తండ్రి గురించిన పోస్ట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఎంగేజ్మెంట్ సందర్భంగా తీసిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్నారు. “ఇతరులకు సేవ చేయాలన్న మీ అభిరుచి మాకు స్ఫూర్తిని ఇచ్చింది. మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూ సరైన దిశలో నడిపిస్తారు” అని కాప్షన్ ను జత చేసారు.
Advertisement
లావణ్య త్రిపాఠి ఇప్పుడు మెగా ఇంటి కోడలు కావడంతో ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయిపొయింది. మెగా ఫ్యామిలీ కి కాబోయే వియ్యంకుడు ఈయనే అంటూ మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ తరువాత లావణ్య త్రిపాఠి చేసిన మొదటి పోస్ట్ కూడా ఇదే.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఆ హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించిన సినిమాలు ఇవే..!
చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?
ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!