మేడారం మహా జాతర ప్రత్యేక పూజలు బుధవారం మొదలవబోతున్నాయి. మండమెలిగే పండుగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవం తో జాతర మొదలవుబోతున్నట్లు పూజారులు భావిస్తారు. ఇక మేడారం మహా జాతర ప్రత్యేక పూజలు కి సంబంధించి మరిన్ని వివరాల లోకి వెళితే… ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలతో ఈ వేడుకని జరుపుతారు. బుధవారం ఉదయం నుండి బుధవారం వేకువ జాము వరకు ఇది జరుగుతుంది మేడారంలోని సమ్మక్క దేవత పూజ మందిరం, కన్నెపల్లి సారమ్మ గుడి, పూనుగొండ్ల అలానే కొండాయి గ్రామంలో పగిడిద రాజు గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.
Advertisement
Advertisement
అయితే పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవట రెండేళ్లకి ఇవి పాతబడిపోవడం తో పూజారులు అడవికి వెళ్లి చెట్టు కొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకు వచ్చి దేవుళ్ళ కి కొత్తగా గుడిని నిర్మించారు అలా పండగ ని జరుపుకునే వారు దీనిని మండమెలిగే పండగ అని అంటారు. పూజారులందరూ ఆచారం ప్రకారం తోచిన పని చేస్తూ పగలంతా మండమెలిగి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!