Telugu News » May 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 9th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY MADDIBOINA

Mk Stalin

Ads

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కోసం నేడు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తున్నారు. స్టాలిన్ తమిళ సీఎంగా ఏడాది పాలన పూర్తైన నేపథ్యంలో యువశక్తి సభ్యులు ఈ పూజలు నిర్వ‌హిస్తున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ‌హించ‌నున్నారు.

కామారెడ్డి నిజాం సాగర్ మండలం హసన్ పల్లి రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రమాద ఘటనపై మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్ర‌క‌టించారు. క్షతగాత్రులకు 50 వేలు ప్రధాని రిలీఫ్ ఫండ్ కింద అందిస్తామ‌ని తెలిపారు.

ముంబైలో ఎన్ఐఏ భారీగా దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటూ హవాలా ఆపరేటర్లపై దాడులు నిర్వ‌హిస్తోంది.

రేపు ఏపీలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని విశాఖ‌వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. రేపు వేకువ‌జామున‌ తుఫాన్ దిశ మార్చుకుని ఉత్తర ఒడిశా తీరం వైపు కదులుతోందని అంచనా వేసింది. దాంతో ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. అంతే కాకుండా ఓడ రేవుల్లో కూడా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు తుఫాన్ తీరం దాటేవరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ఐపీఎల్ 2022 నిన్న జ‌రిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 91 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

రెండో ప్ర‌పంచ‌యుద్దంలో జ‌ర్మ‌నీ ఓట‌మికి గుర్తుగా నేడు ర‌ష్యాలో విక్ట‌రీ డే ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. దాంతో పుతిన్ ప్ర‌సంగం పై ఉత్కంట నెల‌కొంది. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయి యుద్దం ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో పుతిన్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

హాంకాంగ్ పాల‌కుడిగా చైనా అనుకూల జాన్ లీ ఎన్నిక‌య్యారు. జూన్ 1న కేరీలామ్ స్థానంలో జాన్ లీ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన లోకేష్ సోథియా అనే మందుబాబు మద్యం కిక్కు ఎక్క‌లేదంటూ హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు. నాలుగు కోట‌ర్ లు తాగిన‌ప్ప‌టికీ కూడా మ‌త్తు ఎక్క‌డం లేదంటూ ఆబ్కారిశాఖ‌తో పాటూ ఆ రాష్ట్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.

నేపాల్ కు చెందిన షెర్మా కార్పా కార్మి రితా అరుదైన ఘ‌న‌త సాధించాడు. ప్ర‌పంచంలో ఎత్తైన ఎవ‌రెస్ట్ శిక‌రాన్ని షెర్పా కార్మి రితా ఏకంగా 28 సార్లు అదిరోహించి అరుదైన రికార్డును సాధించాడు.


రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ ల కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ప్ర‌స్తుతం ఆర్కే బీచ్ లో జ‌రుగుతోంది. దాంతో సెల్ఫీల కోసం అక్క‌డ‌కు వ‌చ్చిన‌వారు రామ్ చ‌ర‌ణ్ వెంట‌ప‌డ్డారు.


You may also like