Telugu News » May 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY MADDIBOINA

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీసు స్టేషన్ పరిధిలోని తోగ్గూడెం సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్ పై నక్సల్స్ కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరపగా సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారూ

Ads
Ap cm jagan

Ap cm jagan

ఏపీ సీఎం జగన్ రేపు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి మజరా గ్రామం గుమ్మటం తండాలో పర్యటించనున్నారు. గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 5,410 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాద లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు.

భారీ వర్షాల తో తుంగభద్ర జలాశయానికి ఇన్ ఫ్లో పెరిగింది. దాంతో పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1593 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్ నిండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

హైదరాబాద్‌ పాతబస్తీ మాదన్నపేటలో భారీ శబ్దంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో స్థానికులు భయం తో పరుగులు తీశారు. రెండు ఇళ్లు, ఆటో పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పేశారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ‘భారత్‌ జోడో’ యాత్ర పేరుతో కాంగ్రెస్ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ఈ యాత్రను చేపడుతున్నట్టు ప్రకటించింది. జూన్‌ 15 నుంచి 2వ విడత జన జాగరణ్‌ అభియాన్‌ ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరించారు.

నిన్నటితో పోలిస్తే నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,250 గా ఉంది. వెండి తులం ధర రూ.637 గా ఉంది.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ, మినీ అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్ లకు సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్లకు, గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బీహార్ నుండి చత్తీస్గడ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని దీని ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

modi

ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ఫోన్ లో అభినందించారు. పార్టీ కోసం బాగా పని చేస్తున్నారని మోడి బండి సంజయ్ కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర గురించి మోడీ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.

ఏపీలో రైతుల ఖాతాలలో నేడు డబ్బులు జమ కానున్నాయి. వైఎస్సార్ రైతు భరోసా పథకం లో భాగంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు విడతల్లో 13,500 సాయం అందిస్తోంది. ఈ మేరకు మొదటి విడతగా 5,500 రూపాయలను నేడు అకౌంట్లలో జమ చేయనున్నారు.


You may also like