Home » May 11th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

May 11th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తీవ్ర తుఫాన్ నుండి అస‌ని తుఫానుగా బలహీనప‌డింది. రేపు ఉదయానికి వాయుగుండంగా తుఫాను బలహీనపడనుంద‌ని వాతావార‌ణ శాఖ వెల్ల‌డించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా అస‌ని తుఫాను క‌దిలిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరయ్యింది. పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో నారాయణ అరెస్ట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. అరెస్ట్ త‌రవాత పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాగా వ్యక్తిగత పూచీకత్తుపై నారాయ‌ణ‌కు బెయిల్ మంజూరు చేశారు.

Advertisement


ఐపీఎల్ 2022 లో గ‌త‌రాత్రి జ‌రిగిన మ్యాచ్ లో లక్నోపై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజ‌యం సాధించింది. గుజరాత్ 4 వికెట్ల న‌ష్టానికి 144 పరుగులు సాధించగా లక్నో 82 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది.

తెలంగాణ‌లోని 8 జిల్లాల‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఖ‌మ్మం, న‌ల్గొండ‌, భ‌ద్రాద్రికొత్త‌గూడెం, ములుగు, మంచిర్యాల‌, భూపాల్ ప‌ల్లిలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

క్రికెట‌ర్ రాహుల్ ద్రావిడ్ బీజేపీ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లపై స్పందించారు. ఆ వార్త‌లు శుద్ద త‌ప్ప‌ని రాహుల్ ద్రావిడ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం రెండో దశలో భాగంగా పీఎంఏవై–వైఎస్సార్‌ గ్రామీణ్‌లో భాగంగా 1,79,060 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.

ఫిలిప్పీన్స్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మార్కోస్ జూనియ‌ర్ ఘ‌న‌విజ‌యం సాధించారు.

ఆర్థిక‌సంక్షోభం కార‌ణంగా శ్రీలంక‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఆ దేశ ర‌క్ష‌ణ‌శాఖ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. నిర‌స‌న కారులు ప్రభుత్వ ఆస్తుల‌కు న‌ష్టం కలిగించినా, ఎవ‌రినైనా గాయ‌ప‌ర‌చాల‌ని చూసినా ఉపేక్షించ‌వ‌ద్ద‌ని ఆర్మీ, పోలీసుల‌కు ఆదేశాలు జారిచేసింది. వారెంట్ లేకుండా ఎవ‌రినైనా అరెస్ట్ చేసేయండ‌ని ఆదేశించింది.

ఐటీ సిటీ బెంగుళూరులో వాహ‌నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో పాటూ ప్ర‌జ‌ల‌ను కాలుష్యం వెంటాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న రిజిస్ట్రేష‌న్ లే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఫుడింగ్ అండ్ మింక్ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ కు బెయిల్ మంజూర‌య్యింది. ఇదే కేసులో ప్ర‌ధాన నింధితుడిగా ఉన్న ప‌బ్ మేనేజ‌ర్ అనిల్ కు బెయిల్ ను నిరాక‌రించింది.

Visitors Are Also Reading