షాయాజీ షిండే గురించి స్పెషల్ చెప్పాల్సిన పనిలేదు. ‘ఠాగూర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షాయాజి షిండే ఆ తర్వాత ‘వీడే’, ‘గుడుంబా శంకర్’, ‘అతడు’, ‘సూపర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవదాసు, పోకిరి వంటి చిత్రాలు ఇతని రేంజ్ ను మరింత పెంచాయనే చెప్పాలి. దాంతో ఇతనికి తెలుగులో కూడా వరుస అవకాశాలు లభించాయి. ఇతను ఓ మరాఠీ నటుడు అయినప్పటికీ, తాను నటించిన తెలుగు సినిమాలో 95% పైగా సినిమాలకు అతనే డబ్బింగ్ చెప్పుకున్నాడు.
read also : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. TSPSC నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్..
Advertisement
షాయాజీ వివాదంలో చిక్కుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ విలన్ ఇటీవల ఒక మరాఠీ సినిమాను ఒప్పుకున్నాడట. ఇక ఆ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషకం అందుకుంటున్న షిండే, షూటింగ్ కి వస్తానని నమ్మకంగా చెప్పి డేట్స్ ఇచ్చిన సమయంలో మాత్రం షూటింగ్ కు హాజరుకాలేదట. దీంతో సదరు నిర్మాత భారీగా నష్టపోయాడట.
Advertisement
కాగా, షూటింగ్ ఎందుకు రాలేదు అని షిండేను అడిగితే సమాధానం చెప్పలేదని, కథ చెప్పేటప్పుడు కొన్ని మార్పులు చేయమన్నాడని, తాము చేయము అనేసరికి సెట్ లోనే అందరి ముందు గొడవపడ్డాడని నిర్మాత చెప్పుకొచ్చాడు. అయితే తన కారణంగా సెట్ లో ఆరోజు షూటింగ్ ఆగిపోయిందని ఆ కారణంగా తాను రూ. 17 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. దీంతో తనకు నష్టపరిహారం షిండే చెల్లించాలని కోరుతూ సదరు నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. ఈ నష్టం మొత్తం తనకు తిరిగి ఇప్పించాలని పోలీసులతో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్ లోను ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి ఈ వివాదంపై షాయాజీ షిండే ఎలా స్పందిస్తాడో చూడాలి.
ఇవి కూడా చదవండి : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్, విశాఖలో టీమిండియా మ్యాచ్‌లు