Home » మొద‌టిసారి కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్…నెట్టింట వైరల్..!

మొద‌టిసారి కాబోయే భార్య ఫోటోను షేర్ చేసిన మనోజ్…నెట్టింట వైరల్..!

by AJAY
Ad

మోహ‌న్ బాబు న‌ట‌వార‌సుడు మ‌నోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గ‌త కొద్దిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌నోజ్ కు ఇప్ప‌టికే వివాహం కాగా భార్య‌తో విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా మనోజ్ భూమా మౌనికారెడ్డితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. భూమా మౌనికారెడ్డికి కూడా ఇప్ప‌టికే వివాహం అవ్వ‌డంతో పాటూ ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

Advertisement

కాగా ఇద్ద‌రూ మొద‌టి పెళ్లికి ముందే ప్రేమించుకున్నార‌ని ఇప్పుడు విడాకులు తీసుకుని రెండో పెళ్లి ద్వారా క‌లుస్తున్నార‌ని కూడా టాక్ ఉంది. అయితే నిన్న‌టి వ‌రకూ మ‌నోజ్ మౌనికారెడ్డిల పెళ్లి గురించి వార్త‌లు వినిపించాయి కానీ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. అంతే కాకుండా మ‌నోజ్ తాను మౌనికారెడ్డిని వివాహం చేసుకుంటాన‌ని ఎప్పుడూ ప్ర‌క‌టించలేదు.

Advertisement

కానీ మార్చి 3న వీరి వివాహానికి ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్టుగా వార్త‌లు వినిపించాయి. ఇక ఎట్ట‌కేల‌కు వీరి మెహందీ ఫంక్ష‌న్ కూడా నిన్న జరిగింది. వీరి పెళ్లివేడుక మంచు ల‌క్ష్మి ఇంట్లో జ‌ర‌బోతుంద‌ని స‌మాచారం. అంతే కాకుండా మ‌నోజ్ సోద‌రి మంచుల‌క్ష్మినే వీరి పెళ్లిని జ‌రిపిస్తున్న‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ALSO READ :Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?

ఇదిలా ఉంటే మొద‌టిసారి మ‌నోజ్ త‌న‌కు కాబోయే భార్య మౌనికా రెడ్డి ఫోటోను షేర్ చేసి క‌న్ఫామ్ చేశాడు. ఎం వెడ్స్ ఎం..అని వ‌ధువు మౌనికా రెడ్డి అని ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. మ‌నోజ్ ఫోటోను షేర్ చేయ‌డంతో వీరిపెళ్లి పై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఈ రోజు రాత్రి 8 30 నిమిషాల‌కు వీరి వివాహ ముహూర్తం ఖ‌రార‌య్యింది. వీరి వివాహానికి కేవ‌లం స‌న్నిహితులు మ‌రియు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రవుతున్న‌ట్టుగా టాక్ వినిపిస్తోంది.

ALSO READ : సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో… అది చూసిన భార్య ఏం చేసిందంటే?

Visitors Are Also Reading