Home » మంచువారింట మొద‌లైన పెళ్లి సంద‌డి…హ‌ల్దీ పిక్స్ వైర‌ల్..!

మంచువారింట మొద‌లైన పెళ్లి సంద‌డి…హ‌ల్దీ పిక్స్ వైర‌ల్..!

by AJAY
Ad

మంచు వారింట పెళ్లి సంద‌డి మొద‌ల‌య్యిందా..? మౌనిక‌తో మ‌నోజ్ వివాహం జ‌ర‌గబోతుందా..? అంటే అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. గ‌త కొద్దిరోజులుగా మ‌నోజ్ భూమా మౌనిక‌లు ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా వీరిద్ద‌రూ హైద‌రాబాద్ లోని ఓ గ‌ణేష్ మండపం వ‌ద్ద క‌లిసి పూజ‌లు చేసిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

Advertisement

ఆ నాటి నుండి మ‌నోజ్ రెండో పెళ్లి వార్త‌లు మొద‌ల‌య్యాయి. అయితే మొద‌ట మ‌నోజ్ ఆ వార్త‌ల‌ను ఖండిస్తూనే త్వ‌ర‌లోనే అన్ని విష‌యాల‌పై క్లారిటీ ఇస్తాన‌ని చెప్పారు. ఇంత‌లోనే మ‌నోజ్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా మార్చి 3న వీరి వివాహం జ‌ర‌గ‌బోతున్న‌ట్టు టాక్ మొద‌ల‌య్యింది. దీనికి తోడు మ‌నోజ్ సోద‌రి మంచు ల‌క్ష్మి తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో మ‌నోజ్ మెహందీ ఫోటోల‌ను సైతం సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

ALSO READ :సుడిగాలి సుధీర్- గెటప్ శ్రీను విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?

Advertisement

దాంతో మనోజ్ మౌనికల పెళ్లి పై ఫుట్ క్లారిటీ వ‌చ్చేసింది. అంతే కాకుండా మంచు ల‌క్ష్మి ఇంట్లోనే వీరి వివాహం జ‌ర‌గ‌బోతున్న‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక వీరి వివాహానికి అతిద‌గ్గ‌రి బంధువులు మ‌రి సన్నిహితుల‌ను మాత్ర‌మే ఆహ్వానించినట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే మ‌నోజ్ కు ఇప్ప‌టికే వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కాగా మొద‌టి భార్య‌తో మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో వారు విడాకులు తీసుకున్నారు. మ‌రోవైపు మౌనికా రెడ్డికి కూడా ఇప్ప‌టికే వివాహం జ‌ర‌గ్గా భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు ఇద్ద‌రూ మ‌ళ్లీ కొత్త జీవితంలో అడుగుపెడుతుండ‌టం సంతోష‌కరం.

ALSO READ :తుదిశ్వాస వ‌ర‌కూ నిన్నే ప్రేమిస్తా…. తార‌క‌ర‌త్న భార్య రాసిన‌ లేఖ వైర‌ల్..!

Visitors Are Also Reading