Home » సింగర్ ”మనో” ఒక పాటకి ఎంత తీసుకుంటారో తెలుసా..?

సింగర్ ”మనో” ఒక పాటకి ఎంత తీసుకుంటారో తెలుసా..?

by Sravya
Ad

సింగర్ మనో అసలు పేరు నాగూర్ బాబు. గాయకుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడుగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు మనో. మనో తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు పాతిక వేలకి పైగా పాటలు పాడారు. గాయకుడిగా మనో మురళీమోహన్ జయభేరి పథకం మీద తీసిన కర్పూర దీపం సినిమాకి పాడారు. అలానే మనో రజనీకాంత్ తెలుగు సినిమాలకి గాత్ర దానం చేసి పేరు పొందారు.

Advertisement

బుల్లితెరపై వచ్చే పలు కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తూ ఉంటారు. విశ్వనాథ్ గారి దగ్గర, విశ్వనాథ్ గారు ఇళయరాజా గారి కాంబినేషన్ తో కూడా కలిసి పని చేశారు మనో. ప్రతి సినిమాకి కూడా పాటలు చాలా ముఖ్యమైనవి, ఏ సినిమాలో అయినా కచ్చితంగా పాటలు ఉండాలి. అందుకే పాటల మీద కూడా శ్రద్ధ ఎక్కువ పెడుతుంటారు. కానీ సినిమా కోసం పెట్టిన అంత ఖర్చు సింగర్లకి ఇవ్వరని మనో అన్నారు.

Advertisement

హిందీ సినిమాల్లో పాడిన వాళ్ళకి కంటే ఇక్కడ ప్రాంతీయ భాషలో పాడిన వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారని మనో అన్నారు. చూసే వాళ్ళకి సింగర్లకి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందేమో అని అనుకుంటారు కానీ ఎక్కువ డబ్బులు సింగర్లకి ఇవ్వరు అని మనో అన్నారు. ఐదు పాటలు పాడారు కదా ఐదు లక్షలు వరకు వచ్చేస్తాయి ఏమో అనుకుంటారు కానీ ఇచ్చేది 15000 అని తెలియదని మనో చెప్పారు.

Also read:

Visitors Are Also Reading