బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర లేని సెలబ్రిటీలు అయిన నిరుపమ్, మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు డాక్టర్ బాబు. ప్రస్తుతం డాక్టర్ బాబు కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఈ సీరియల్ నుంచి తప్పకుండా డాక్టర్ బాబు సీరియల్ కు కమిట్ కాలేదు.
Also Read : భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉందా…? అయితే ఈ సమస్యలు తప్పవట..!
Advertisement
డాక్టర్ బాబు బుల్లితెరపై ప్రసారం అయ్యే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డాక్టర్ బాబు తెలుగు నూతన సంవత్సరం రోజు జరుపుకునే ఉగాది పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా అనే కార్యక్రమంలో కూడా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి తన భార్య మంజులను కూడా తీసుకొచ్చారు.
Advertisement
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు మంజుల కూడా తనదైన శైలిలో సందడి చేశారు. ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచులతో ఒక రుచి అయినా చేదు గురించి చెప్పమని అడగగా.. మంజుల తన జీవితంలో జరిగినొక చేదు ఘటన గురించి తెలియజేశారు. ఆరు సంవత్సరాల క్రితం తనకు వైరల్ ఆర్థరైటిస్ రావడంతో లేవలేని స్థితిలోకి వెళ్లిపోయాను. అసలు బ్రతుకుతారా..? లేదా అనే అనుమానం కూడా వచ్చిందని.. తన జీవితంలో జరిగిన చేదు ఘటన గురించి తెలియజేస్తూ కంటతడి పెట్టారు మంజుల. ప్రస్తుతం ఉగాది ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Also Read : నటుడు నరేష్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు..? మొదటి భార్య ఎవరో తెలుసా..?