టాలీవుడ్ లో ఈ మధ్యే కాలంలో సినిమాలను హిట్ చేయడానికి పాటలు కూడా చాలా అవసరం అవుతున్నాయి. సినిమా కంటే ముందే విడుదల అయ్యే పాటలు జనాలను ఆకట్టుకుంటేనే ఆ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఒక్క పాట అనేది హిట్ అయితే అది పాడిన ప్లే బ్యాక్ సింగర్ కు కూడా బాగానే పేరు అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో బాగా పేరు అనేది సంపాదించిన ప్లే బ్యాక్ సింగర్ లలో మంగ్లీ కూడా ఒక్కరు.
Advertisement
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో వస్తున్న సినిమాల్లో తెలంగాణ యాసకు పెరుగుతున్న ప్రాముఖ్యత అనేది అందరికి తెలుసు. అందుకే మొదట్లో కేవలం యూట్యూబ్ లోనే పాటలు పడే మంగ్లీకి సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. మంగ్లీ తెలంగాణ యాసలో పాటలు పడటంలో దిట్ట. సారంగధారియా అంటూ మంగ్లీ పాడిన పాట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
అయితే ప్రస్తుతం మంగ్లీకి సినిమాల్లో పాటలు పడే అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. కానీ ఒక్క పాట అనేది పాడటానికి మంగ్లీ తీసుకునే రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు చర్చగా మారింది. మంగ్లీ ఇప్పటికి కూడా యూట్యూబ్ లో పాటలు విడుదల చేస్తుంది. వాటి వల్ల ఎందరో అభిమానులను సంపాదించుకున్న మంగ్లీ.. ప్రస్తుతం ఒక్కో పాటకు నాలుగు లక్షల వరకు వసూల్ చేస్తునట్లు సమాచారం. కానీ ఆమెకు ఉన్న క్రేజ్ వల్ల నిర్మాతలు కూడా అడిగినంత ఇస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :