Home » ప్రపంచ కప్ లో హైదరాబాదీ పేసర్ కు అవకాశం..!

ప్రపంచ కప్ లో హైదరాబాదీ పేసర్ కు అవకాశం..!

by Azhar
Ad

హైదరాబాద్ కు చెందిన ఒక్క ఆటగాడు అయిన ఎప్పుడు భారత జట్టులో ఉంటునే వస్తున్నాడు. కానీ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలు అవి కూడా టీ20 ప్రపంచ కప్ లో మాత్రం ఇప్పటివరకు ఒక్క హైదరాబాద్ ఆటగాడు కూడా ఆడలేదు. కానీ ఇప్పుడు ఆ అవకాశం హైదరాబాదీ పేసర్ అయిన మొహ్మద్ సిరాజ్ కు రానున్నట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే వచ్చే నెల చివర్లో జరగనున్న ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. కానీ అందులో ఇప్పుడు ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు దూరం అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ బుమ్రా ప్రపంచ కప్ కు దూరం అయితే ఆ స్థానంలో సిరాజ్ ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు అనుకుంటున్నారు. అందుకు కారణం సిరాజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో అదరగొడుతున్నాడు.

Advertisement

ఇక ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మొత్తం పిచ్లు ఒకే మాదిరి పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. అందుకే సిరాజ్ ను జట్టులోకి తీసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా జట్టుకు దూరంగా షమీ.. ప్రపంచ కప్ జట్టుకు స్టాండ్ బై ఆటగాడిగా ఉన్నాడు. కాబట్టి షమీ అప్పటివరకు కోలుకొని ఫిట్ గా ఉంటె.. అతను ప్రధాన జట్టులోకి వెళ్తాడు. ఇక సిరాజ్ స్టాండ్ బై ఆటగాడిగా ఉంటాడు. ఒకవేళ షమీ ఫిట్ గా లేకపోతే.. సిరాజ్ నేరుగా జట్టులోకి వెళ్తాడు అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

తిరువనంతపురంలో బౌలింగ్ పించ్ వెనుక కారణాలు తెలుసా..?

ఒక్కే మ్యాచ్ లో గొప్ప, చెత్త రికార్డులు సృష్టించిన రాహుల్..!

Visitors Are Also Reading