‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది అసోసియేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విభేదించినా తప్పులేదు. కానీ అసోసియేషన్ మొత్తాన్ని తప్పుబడుతూ మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవడానికి వేదిక ఉందన్నారు. మీడియా వరకు వెళ్లి మా అసోసియేషన్ కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఇది చాలా తప్పు అని మంచి విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : మన స్టార్ హీరో హీరోయిన్స్ అసలు పేర్లు ఇవేనని తెలుసా ? చాలామందికి తెలియని పేర్లు !
Advertisement
ప్రతీ ఒక్కరి జన్మదిన వేడుకలకు ఫోన్లు చేసిన మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వారి యోగ క్షేమాల గురించి కూడా అడిగి తెలుసుకుంటున్నాను. మేము అంతా కుటుంబంలో కలిసి ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసోసియేషన్ ని తప్పుబడుతూ వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. అసలు ఇంతకు ఈ వివాదం ఎక్కడ వచ్చిందంటే RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.
Advertisement
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అన్నీ విభాగాల ప్రతినిధులు, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రధాన విభాగాలలో ఒకటైన మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు హాజరు కాలేదు. ఆ సమయంలో మంచు విష్ణు విదేశాల్లో ఉండడంతో మా అసోసియేషన్ తరపున వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి హాజరయ్యారు. దీంతో మంచు విష్ణు రాకపోవడంతో ఆయనపై ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంచు విష్ణు లెటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు