గత కొద్ది రోజులుగా మంచు బ్రదర్స్ వివాదం జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఇటీవలే మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ వివాదంపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఇది ఇలా ఉండగా, అసలు మంచు బ్రదర్స్ మధ్య గొడవకు కారణం ఎవరు అంటే అందరూ చెప్పే సమాధానం సారధి. అసలు ఎవరితను, మంచు బ్రదర్స్ మధ్య ఎలా వచ్చారు? వీరి మధ్య చిచ్చు పెట్టడం ఏంటి? అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
Advertisement
READ ALSO : IPL 2023 : KKR కెప్టెన్ గా సునీల్ నరైన్… అయ్యర్ పై వేటు!
Advertisement
అసలు ఈ సారధి ఎవరంటే మంచు విష్ణు అనుచరుడు. మీరు ఒకసారి పాత వీడియోలు చూస్తే మంచు విష్ణు పక్కన సారధి కనిపిస్తాడు. మంచు విష్ణుకు సంబంధించిన ప్రతి విషయం అతనికి తెలుసు. మా ప్రెసిడెంట్ అయ్యే వరకు కూడా విష్ణు పక్కనే సారధి ఉన్నాడు. అయితే మధ్యలో ఏమైందో ఏమో కానీ సారధి అన్నను వదిలి తమ్ముడు పక్కకు చేరాడు. ప్రస్తుతం అతను మనోజ్ కు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు బాగానే ఉన్న, మనోజ్ పక్కన ఉండి విష్ణు పర్సనల్ విషయాలను కూడా అతను మనోజ్ కు చెప్తున్నాడట.
READ ALSO : RC 15 : ‘గేమ్ చేంజర్’ గా రామ్ చరణ్… ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఇదే!
విష్ణు గురించి మనోజ్ కు నెగిటివ్ గా చెప్తూ అతనిపై కోపం తెప్పించేలా మాట్లాడుతున్నాడట. అది నచ్చని విష్ణు, సారధిపై గుర్రుగా ఉన్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా విష్ణుపై అనుచిత వాక్యాలు చేయడంతోనే కోపం తట్టుకోలేక విష్ణు సారధిపై దాడికి పాల్పడినట్టు సమాచారం. అయితే తన వద్ద మేనేజర్ గా చేస్తున్న వ్యక్తిని తాను ఎప్పుడూ ఉద్యోగిగా చూడలేదని, బంధువుగానే చూసానని మనోజ్ చెప్పడం విశేషం. అందుకే వీడియోలో కూడా మా బంధువులపై దాడి చేస్తున్నాడని విష్ణు పేరును చెప్పుకొచ్చాడు. ఇలా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది సారధినే అని తెలుస్తోంది.
Advertisement
READ ALSO : Honey Rose : లేటు వయస్సులో పెళ్లికి సిద్ధమైన బాలయ్య బ్యూటీ…వరుడు ఎవరంటే?