Home » ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించి అడ్డంగా బుక్కైన మంచు మ‌నోజ్…1

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంగించి అడ్డంగా బుక్కైన మంచు మ‌నోజ్…1

by AJAY
Ad

గత కొద్దిరోజులుగా హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్ ల‌ను అంటించుకుంటే వెంట‌నే వాటిని తొలింగించి సెల‌బ్రెటీల‌కు ఫైన్ లు వేస్తున్నారు. ఇటీవ‌ల జూనియ‌ర్ ఎన్టీఆర్ కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ల‌ను తొల‌గించి ఫైన్ విధించారు. ఆ త‌ర‌వాత జూబ్లిహిల్స్ లో క‌ల్యాణ్ రామ్ కారుకు కూడా బ్లాక్ ఫిల్మ్ లు ఉండ‌టం గుర్తించి వాటిని తొల‌గించారు.

Advertisement

అదే రోజు జూబ్లిహిల్స్ లో అల్లు అర్జున్ కారు కూడా బ్లాక్ ఫిల్మ్ ల‌తో పోలీసుల‌కు దొరికిపోయింది. దాంతో అల్లు అర్జున్ కారుకు అంటించిన బ్లాక్ ఫిల్మ్ ల‌ను కూడా తొల‌గించారు. కాగా ఇప్పుడు మంచు మ‌నోజ్ కు కూడా అదే ప‌రిస్థితి ఎదుర‌య్యింది. హైద‌ర‌బాద్ లో టోలిచౌకి వ‌ద్ద పోలీసులు త‌నికీలు నిర్వ‌హిస్తుండ‌గా మంచు మ‌నోజ్ కారు న‌డుపుతూ వెళ్లారు.

Advertisement

Manchu Manoj

Manchu Manoj

అయితే ఆ కారుకు పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ల‌ను గుర్తించ‌డంతో వెంట‌నే కారును ఆపి బ్లాక్ ఫిల్మ్ ల‌ను తొల‌గించారు. అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంగించినందుకు గానూ మంచు మ‌నోజ్ కు రూ.700 జ‌రిమానా కూడా విధించారు. ఇదిలా ఉంట‌డ‌గా నేరాలు జ‌ర‌గ‌కుండా నింధితులు త‌ప్పించుకోకుండా ఉండేందుకు సెల‌బ్రెటీలు సైతం కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్ ల‌ను తగిలించుకోకూడ‌దు అని రూల్స్ విధించిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading