Home » మంచు మనోజ్-భూమా మౌనిక రెండో పెళ్లి జరిగేది ఆరోజేనా..?

మంచు మనోజ్-భూమా మౌనిక రెండో పెళ్లి జరిగేది ఆరోజేనా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరో హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాలు ఆపేసి దాదాపు ఐదేళ్లు కావస్తున్న విషయం తెలిసిందే. 2017లో ఒక్కడే మిగిలాడు మంచు మనోజ్ నటించిన చివరి సినిమా. ఆ తరువాత అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా టైటిల్ ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. కానీ తరువాత దాని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఈ చిత్రం పక్కకెళ్లిపోయింది. పరిస్థితి ఇలా ఉంటే మంచు మనోజ్ 2015లో ప్రణతిరెడ్డి, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తెలిసిందే. పెళ్లి చేసుకున్న రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు.

Advertisement

ప్రణతిరెడ్డి ప్రస్తుతం అమెరికాలో జాబ్ చేస్తుంది. ఎవరికి వారు విడిపోవడంతో మనోజ్ మరొపక్క దివంగత రాయలసీమ రాజకీయ పొలిటికల్ నేత దివంగత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కూడా పలు సందర్భాల్లో బయట మీడియాకి కనబడడం జరిగింది. గతంలో హైదరాబాద్ లో గణేష్ మండపానికి ఈ జంట కలిసి రావడం హాట్ టాపిక్ గా మారింది. అనంతరం భూమా నాగిరెడ్డి జయంతి రోజునే ఆయన సమాధి వద్దకు మంచు మనోజ్ భూమా మౌనిక కలిసి వెళ్లి నివాళులు అర్పించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలు మరింత బలం చేకూరుతుంది.  

Advertisement

Also Read :  ఆ విష‌యంలో మ‌హేశ్ బాబుతో గొడ‌వలు..ఓపెన్ గా చెప్పేసిన నమ్ర‌త‌..!

Manam News

మరోవైపు భూమా మౌనిక మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తరువాత హైదరాబాద్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితమే చెన్నైలోనే ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఓ విల్లాస్ లో ఉండే మౌనిక రీసెంట్ గాహైదరాబాద్ కి మకాం మార్చడం జరిగిందట. ఇదిలా ఉంటే.. పెద్ద దర్గాని సందర్శించారు మంచు మనోజ్. త్వరలో కొత్త జీవితంలో అడుగుపెట్టి కొత్త సినిమాలు చేయనున్నట్టు స్పష్టం చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న మంచు మనోజ్-మౌనిక పెళ్లి జరుగనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారిక ప్రకటన మంచు మనోజ్ చేయనున్నట్టు సమాచారం.  

Also Read :  మధుమేహం అదుపులో ఉంచుకోవడానికి చిట్కాలు ఇవే..!

Visitors Are Also Reading