Home » “మ‌న‌సంతా నువ్వే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎక్క‌డ ఉంది ఏం చేస్తుందంటే..?

“మ‌న‌సంతా నువ్వే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎక్క‌డ ఉంది ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

ఉదయ్ కిరణ్ కెరీర్ లోని సూపర్ హిట్ సినిమాలలో మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడిగా రీమాసేన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఉదయ్ కిరణ్ కు వరుస ఆఫర్లు వచ్చాయి. దాంతో ఒక్కసారిగా బిజీగా మారిపోయాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ కూడా వ‌రుస‌ ఆఫర్లను అందుకుంది.

Advertisement

అయితే ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ రీమాసేన్ చిన్ననాటి పాత్రలలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు కూడా తమ నటనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రిమాసేన్ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ చిన్నారి హెయిర్ స్టైల్ చాలామందిని మెప్పించడంతో తల్లిదండ్రులు తమ అమ్మాయిలకు అలాంటి హెయిర్ స్టైల్ నే చేయించారు కూడా.

Advertisement

మనసంతా నువ్వే సినిమాలో తూనీగ తూనీగ పాట కూడా అప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. ఈ పాటలో చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత సుహానికి కూడా మంచి అవకాశాలు వచ్చాయి. కానీ చ‌దువు డిస్ట‌బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక 20 ఏళ్లు దాటిన తర్వాత సుహాని హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ లో దిల్ రాజు నిర్మించిన స్నేహగీతం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజ‌యం సాధించ‌లేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాల‌కు దూరం అయ్యింది. అంతే కాకుండా మోటివేషనల్ స్పీకర్ విభర్ హసిజ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ భర్తతో హ్యాపీగా ఉంటుంది. ఇక మళ్లీ ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.

Also read :పిల్ల‌లు-త‌ల్లిదండ్ర‌ల మ‌ధ్య దూరం పెంచే ఐదు అంశాలు ఇవే..!

Visitors Are Also Reading