నిర్మాత MS రాజు 15 కోట్లతో దేవి పుత్రుడు సినిమా తీసి నష్టపోయాడు! ఎలాగైనా ఓ మంచి సినిమా తీసి ఆ నష్టాన్ని కవర్ చేసుకోవాలనే ఆలోచనలో ఉండగా…. తన ఆప్తుడైన గోపాల్ రెడ్డి సలహా మేరకు అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న VN ఆదిత్యకు ఫోన్ చేసి తన ఆఫీస్ కు రమన్నాడు.
Also Read: తగ్గదేలే అంటున్న బాలయ్య ఫ్యాన్స్…అఖండ పేరుతో హోటల్..!
Advertisement
ఆఫీస్ కు వచ్చిన VN ఆదిత్యతో MS రాజు ఓ లైన్ చెప్పి చిన్న బడ్జెట్ లో దాని మీద కథను రెడీ చేయాల్సిందిగా కోరాడు. అప్పటికప్పుడే VN ఆదిత్య “ఒరేయ్ వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుంది రా , మన కన్నీళ్లను ఎదుటివారికి కనిపించకుండా దాచేస్తుంది!” అని ఫ్రెండ్ ను ఓదారుస్తూ మరో ఫ్రెండ్ చెప్పే డైలాగ్ ను MS రాజుకు వినిపించాడు. ఆ డైలాగ్ MS కు చాలా బాగా నచ్చింది. వెంటనే 25 వేల రూపాయల చెక్ రాసి అడ్వాన్స్ గా ఇచ్చి దర్శకుడిగా VNను ఓకే చేసుకున్నాడు.ఈ సినిమా టైటిల్ మనసంతా నువ్వే.
Advertisement
హీరోగా మహేష్ బాబు అయితే బాగుంటుందని మొదటగా MSరాజు మహేష్ ను కలిసి కథ చెప్పారు. కథ బాగున్నప్పటికీ అప్పటికే మహేష్ గుణశేఖర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యి ఉండడంతో ఈ సినిమా ఆఫర్ ను వదులుకున్నాడు. దానికి తోడు కొత్త దర్శకుడు కావడం, కథ కూడా సింపుల్ గా ఉండడంతో మహేష్ ఈ సినిమాను వదులుకున్నాడని టాక్!
దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకు కొత్త హీరో అయితే బాగుంటాడని చెప్పడంతో MSరాజు దృష్టి ఉదయ్ కిరణ్ మీద పడింది. అప్పటికప్పుడు నువ్వు నేను సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్లి అక్కడున్న రష్ ఫీడ్ చూసి తన సినిమాకు హీరోగా ఉదయ్ కిరణ్ ను ఓకే చేశాడు.
1.3 కోట్లతో రూపొందిన ఈ చిత్రం 19 అక్టోబర్,2001న రిలీజై ప్రభంజనం సృష్టించింది. 36 సెంటర్లలో 100 రోజులు ఆడి 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. తర్వాత 5 భాషల్లో రిమేక్ అయ్యింది. ఉదయ్ కిరణ్ క హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ నిచ్చింది.
Also Read: కౌశల్ మామూలోడు కాదుగా..సింగిల్ టేక్ లో రెండు పేజీల డైలాగ్…!