Telugu News » Blog » త‌గ్గ‌దేలే అంటున్న బాల‌య్య ఫ్యాన్స్…అఖండ పేరుతో హోట‌ల్..!

త‌గ్గ‌దేలే అంటున్న బాల‌య్య ఫ్యాన్స్…అఖండ పేరుతో హోట‌ల్..!

by AJAY
Ads

అభిమానులందు బాలయ్య అభిమానులు వేరయా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది హీరోల‌కు అభిమానులు ఉన్నారు కానీ బాలయ్య అభిమానులు మాత్రం కాస్త డిఫరెంట్. బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు పండుగ‌లా జ‌రుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏట‌ను కూడా కోసి పార్టీలు చేసుకుంటారు. ఇక‌ రీసెంట్ గా అఖండ సినిమా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్ నాడు డల్లాస్ లో బాలయ్య అభిమానులు కార్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా థియేటర్లో యువతులు డ్యాన్సులు చేయలేదు. కానీ అఖండ సినిమాకు స్క్రీన్ వద్ద కొంత మంది యువతులు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా అఖండ సినిమా పేరుతో ఓ అభిమాని వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. బాల‌య్య‌ ఫ్యాన్స్ దీనిని తెగ షేర్ చేస్తున్నారు.

akhanda hotel thirupathi

akhanda hotel thirupathi

తిరుపతికి చెందిన బాలయ్య అభిమాని ఒకరు హోటల్ ను ప్రారంభించాడు. ఇక ఈ హోటల్ కు దేవుళ్ళ పేర్లు తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టకుండా బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా పేరును పెట్టాడు. దాంతో బాలయ్య పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం తిరుపతి లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారు అంటూ అభిమానులు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

also read : పవన్ కళ్యాణ్ “ఖుషి” రీమేక్ అనుకున్నారా..? అయితే ఇది చదవాల్సిందే…!


You may also like