మామూలుగా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే అధికారు వద్ద మొర పెట్టుకుంటాం. లేదంటే నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారులను కోరుతాం. అయితే ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం ఎందుకని ఏపీలోని కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన, డయల్ యువర్ కలెక్టర్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే గుంటూరు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ఓ విచిత్రం చోటు చేసుకున్నది.
Advertisement
జిల్లా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యల కోసం కాల్ చేస్తున్నారు. కలెక్టర్ వరుసగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వారికి సమాధానమిస్తున్నారు. అలాగే సదరు సమస్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలిస్తున్నారు.
Advertisement
ఇంతలో ఆయనకు చేబ్రోలు మండలం నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి చెప్పిన సమస్య విని కలెక్టర్ ఒకింత షాక్ కు గురయ్యారు. పింఛన్ రాలేదనో ఇంటి స్థలం మంజూరు కాలేదనో, రేషన్ కార్డు సమస్య లేక మరేదైనా సమస్యనో చెబుతారని కలెక్టర్ భావించారు. కానీ సదరు వ్యక్తి తమ గ్రామంలో జనాభాకు తగ్గట్టు మద్యం షాపులు లేవు అని, కేవలం ఒకే ఒక్క మద్యం షాపు ఉండడంతో అక్కడ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. అంతేకాకుండా గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.
Also Read : సూర్యాపేట జిల్లాలో వింత ఘటన.. పోలీస్ స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ..!