Home » సూర్యాపేట‌ జిల్లాలో వింత‌ ఘ‌ట‌న‌.. పోలీస్ స్టేష‌న్‌కు చేరిన పిల్లి పంచాయితీ..!

సూర్యాపేట‌ జిల్లాలో వింత‌ ఘ‌ట‌న‌.. పోలీస్ స్టేష‌న్‌కు చేరిన పిల్లి పంచాయితీ..!

by Anji
Ad

సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ కు విచిత్రం అయిన పంచాయితీ వ‌చ్చింది. ఆస్తి త‌గాదాలు, భూమి, త‌గాదాలు, డ‌బ్బు పంచాయితీ కోసం పోలీస్ స్టేష‌న్ కు రావ‌డం సహ‌జం. కానీ ఇక్క‌డ ఇద్ద‌రూ మ‌హిళ‌లు ఓ పిల్లి కోసం పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. ఈ అరుదైన పిల్లి కొర‌కు రెండు వర్గాలు మ‌ధ్య పొట్లాట కూడా జ‌రిగింది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌లేక పోలీసులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Also Read :  India Vs Newzealand Women : ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన రిచా ఘోష్

Advertisement

వివ‌రాల్లోకి వెళ్లితే.. హుజూర్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి చెందిన ముత్యాల‌మ్మ కొంత కాలం క్రితం మైసూర్‌నుంచి ఓ పిల్లిని తెచ్చుకుని పెంచుకుంటుంది. 15 నెల‌ల క్రితం ఈ పిల్లి త‌ప్పిపోయింది. పిల్లి కోసం ముత్యాల‌మ్మ వెత‌క‌ని చోటు లేదు. ఈ పిల్లి కోసం ముత్యాల‌మ్మ పిల్ల‌లు కూడా బెంగ పెట్టుకున్నారు. హుజూర్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ఉండే సుక్క‌మ్మ‌కు ఈ పిల్లి దొరికింది. అప్ప‌టి నుంచి ఈ అరుదైన పిల్లిని చాలా ప్రేమ‌గా పెంచుకుంటుంది. ముత్యాల‌మ్మ పిల్లలు ఆడుకుంటూ సుమ్మ‌క్క ఇంటి వ‌ద్ద ఉన్న పిల్లిని గుర్తుప‌ట్టారు. ఈ పిల్లి మాది అని గొడ‌వ చేసారు.

Advertisement

ఈ పిల్లిని రూ.5వేల‌కు కొనుగోలు చేశామ‌ని సుక్క‌మ్మ పేర్కొంటుంది. ఈ పిల్లి మాదంటే మాది అని పెద్ద గొడ‌వ‌కు దిగారు. చివ‌రికీ ఈ పిల్లి పంచాయితీ హుజూర్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు చేరింది. ఈ పిల్లి పంచాయితి కోసం ఇరు వ‌ర్గాల‌కు చెందిన 50 మందికి పైగా పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారంటే ఈ పిల్లి పంచాయితీ గురించి ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. దీని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పంచాయితినీ ఎలా ప‌రిష్క‌రించాలో అర్థంకాక పోలీసులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ వింత అయిన పిల్లి పంచాయితి ఎలా ప‌రిష్కారం అవుతుందో చూడాలి.

Also Read : Pandugappa Fish : చేప‌ల‌కు రారాజు.. అంత‌ర్జాతీయ మార్కెట్ లో భారీ డిమాండ్..!

Visitors Are Also Reading