ఈమధ్య కాలంలో రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో డబ్బులు దోచుకోవడం బయట మాటలు చెప్పి డబ్బులు ని కాజేస్తున్నారు. హైదరాబాదులో బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో పేరుతో భారీ మోసం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తామని అమాయక యువతిని లక్ష్యంగా చేసుకొని భారీగా డబ్బులు లాగేసుకున్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో స్వప్న అనే బాధితురాలు కంప్లైంట్ చేసింది. ఆమె కంప్లైంట్ చేయడంతో ఈ మోసం బయటకి వచ్చింది.
Advertisement
Advertisement
బిగ్ బాస్ లో అవకాశాన్ని ఇప్పిస్తారని సత్య అనే వ్యక్తి ప్రొడక్షన్ ఇంచార్జి అని చెప్పి పరిచయం చేసుకున్నాడట. స్వప్న బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం చూస్తోంది అయితే ఈ క్రమం లోనే బిగ్ బాస్ లోకి పంపిస్తానని చెప్పి సత్య ఆమె వద్ద దాదాపు రెండున్నర లక్షలు లాగేసాడు. ఆఖరికి మోసపోయానని తెలుసుకుని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకి కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడు కోసం వెతుకుతున్నారు అయితే ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!