పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే మమత బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తలకి స్వల్ప గాయమైనట్లు సమాచారం వచ్చింది. బుధవారం వర్ధమాన్ నుండి కొలకత్తా కి తిరిగి వస్తుంటే ఆమె ప్రయాణిస్తున్న కారు చిన్న ప్రమాదానికి గురైంది. వర్షం వలన ఆమె రోడ్డు మార్గం ద్వారా రాజధానికే వస్తున్నారు.
Advertisement
Advertisement
పొగ మంచు ఉండడం తో తక్కువ విజిబిలిటీ వలన డ్రైవర్ సడెన్ గా బ్రేకులు వేశారు దీంతో మమతా బెనర్జీ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రతిపక్ష ఇండియా కూటమి కి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాక్ ని ఇచ్చింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరి గానే పోటీ చేయబోతున్నామని వెల్లడించిన విషయం తెలిసిందే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!