Home » మ‌ళ్లీశ్వ‌రి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

మ‌ళ్లీశ్వ‌రి చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ లు ప్రస్తుతం హీరోలుగా హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తేజసజ్జా హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా హనుమాన్ సినిమాతో త్వరలో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయిలు ప్రస్తుతం హీరోయిన్లుగా సినిమాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు. ఒకప్పుడు ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న గ్రీష్మ. అప్పుడంటే గ్రీష్మ పాప కానీ ఇప్పుడు హీరోయిన్ లా క‌నిపిస్తోంది. గ్రీష్మ మల్లీశ్వరి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అభిమానులను సంపాదించుకుంది. మ‌ళ్లీశ్వ‌రి సినిమాలో ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా పెద్ద కళ్ళు అమాయకమైన ముఖంతో ఆమె చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో కట్టుకున్నాయి.

Advertisement

అయితే ఇప్పుడు చూస్తే మాత్రం గ్రీష్మను అవాక్క‌వ్వాల్సిందే. గ్రీష్మ‌ కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది. ఇప్పటికే ఈ అమ్మడికి పెద్ద మొత్తంలో ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో సైతం నటిస్తోంది.

అయితే సోషల్ మీడియాలో గ్రీష్మ చేస్తున్న పోస్టులు చూస్తుంటే తాను హీరోయిన్ గా నటించడానికి…. అందాలు వలకబోయడానికి సిద్ధం అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా 30కి పైగా చిత్రాల్లో నటించిన గ్రీష్మ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Visitors Are Also Reading